ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 11 పరుగుల తేడాతో పంజాబ్ గెలుపొందింది. 244 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో గుజరాత్.. 232 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ (74) పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ వృధా అయ్యాయి. జాస్ బట్లర్ (54), చివర్లో రుథర్ ఫర్డ్ (46) పోరాడారు. శుభ్‌మన్ గిల్ (33) పరుగులు చేశాడు. ఒక దశలో గుజరాత్ టైటాన్స్ గెలుస్తుందని అనుకున్నప్పటికీ.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన విజయ్ కుమార్ వైశాఖ్ అద్భుత బౌలింగ్ వేశాడు. గుజరాత్ బ్యాటర్లు పరుగులు చేయకుండా కట్టడి చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లతో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మార్కో జన్‌సన్, మ్యా్క్స్‌వెల్ తలో వికెట్ తీశారు.
Read Also: Konda Surekha : అటవీ శాఖపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 97* పరుగులతో చెలరేగాడు. 42 బంతుల్లో 9 సిక్సులు, 5 ఫోర్లతో 97 పరుగులు చేశాడు. చివరలో శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 పరుగులతో చెలరేగాడు. అంతకుముందు.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (47) మంచి ఆరంభాన్ని అందించాడు. మార్కస్ స్టోయినీస్ 20, ఒమర్జాయ్ 16 పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్‌లో సాయి కిషోర్ 3 వికెట్లు పడగొట్టాడు. కగిసో రబాడ, రషీద్ ఖాన్ తలో వికెట్ సంపాదించారు.
Read Also: Off The Record : డైలమాలో బీఆర్ఎస్ నేతలు..సిల్వర్ జూబ్లీ బహిరంగ సభపై గందరగోళం