ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రవేశపెట్టినప్పటి నుంచి జట్ల అదృష్టం మారిపోతుంది. ప్రతి జట్టు 11 మంది ఆటగాళ్లకు బదులుగా 12 మంది ఆటగాళ్లతో గ్రౌండ్‌లో ఆడుతోంది. అయితే.. బీసీసీఐ (BCCI) ప్రవేశపెట్టిన ఈ నియమంతో ఐపీఎల్‌లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. అయితే ఈ నియమం వల్ల కొందరు ఆటగాళ్లు నష్టాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆల్ రౌండర్లు.. సాధారణంగా జట్లు 12వ ఆటగాడిగా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ లేదా బౌలర్‌ను ఎంపిక చేస్తాయి. దీంతో.. ఆల్ రౌండర్ల అవకాశాలను తగ్గించేస్తుంది. ఈ పరిస్థితి వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్ల కెరీర్‌పై ప్రభావం చూపుతుంది.
వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ కెరీర్
2017లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వాషింగ్టన్ సుందర్ కుడిచేతి ఆల్ రౌండర్. ఇప్పటివరకు అతను ఐపీఎల్‌లో 60 మ్యాచ్‌లు ఆడాడు. కానీ.. ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ప్రవేశపెట్టిన తర్వాత.. 22 మ్యాచ్‌లలో అతనికి కేవలం 9 మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం లభించింది. 59 శాతం మ్యాచ్‌లలో అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. 2023 సీజన్‌లో అతనికి 7 మ్యాచ్‌లలో ఆడే అవకాశం లభించగా.. 2024 సీజన్‌లో మాత్రం కేవలం 2 మ్యాచ్‌లలోనే అతనికి అవకాశం వచ్చింది.
Read Also: BCCI: ఈనెల 26న బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ సమావేశం.. ఈ ప్లేయర్లకు కాంట్రాక్టు..!
ఐపీఎల్ 2025లో వాషింగ్టన్ సుందర్ గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్నాడు. అయితే.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం లభించలేదు. దీంతో.. అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని.. దేశంలోని అత్యున్నత ఆటగాళ్లు మాత్రమే ఆడే టీమిండియాలో వాషింగ్టన్ సుందర్‌కు చోటు దక్కింది. కానీ, 10 టీమ్‌లు ఉన్న ఐపీఎల్‌లో తుది జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం లేదు అని కామెంట్ చేశాడు. ఈ పోస్ట్ పై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందిస్తూ.. నాకూ అదే ఆశ్చర్యంగా ఉంది అని రిప్లయ్ ఇచ్చారు.
ఇంపాక్ట్ ప్లేయర్ నియమం వల్ల కొందరు ఆటగాళ్ల కెరీర్‌పై ప్రభావం పడుతుంది. ఆల్ రౌండర్లకు అవకాశం ఇవ్వడం కష్టంగా మారింది.. ఎందుకంటే జట్లు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ లేదా బౌలర్లపై ఎక్కువ నమ్మకం ఉంచుతున్నాయి. వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ.. ఈ నియమం కారణంగా ఎక్కువగా బెంచ్‌లోనే పరిమితమవుతున్నారు.