టీమిండియా జట్టుకు గాయాలు, వైఫల్యాలతో కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియాలో చోటు కోల్పోయి తిరిగి బలంగా వచ్చాడు ఈ ఆల్‌రౌండర్. అయితే అందుకోసం ఎన్నో త్యాగాలు చేసినట్లు చెప్పొకొచ్చాడు పాండ్యా. జట్టుకు దూరమైనప్పుడు తాను చేసిన కృషి.. తనకు ఇటీవలి విజయాల కంటే ఎక్కువ ఆనందాన్నిచ్చినట్టు చెప్పాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వచ్చిన అవకాశాన్ని పాండ్యా పూర్తిగా సద్వినియోగం…
ఫేలవ ఫామ్, గాయం కారణంగా కొంతకాలం భారత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ అదరగొట్టి, తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి ప్రయత్నంలోనే తన జట్టుకి ఐపీఎల్ అందించిన హార్దిక్.. ఆల్‌రౌండర్‌గానూ మంచి ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 487 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీశాడు. ఇంత మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చినందుకే స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి హార్దిక్ ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే…
అంచనాలు లేకుండా వచ్చి గుజరాత్ టైటాన్స్ ఎలా అదరగొట్టింది?పెద్ద టీమ్ లు ఎందుకు విఫలమయ్యాయి? ఐపీఎల్ క్రేజ్ క్రమంగా తగ్గుతోందా?ఫిక్సింగ్ వార్తల్లో నిజమెంత?క్రికెట్ పండగ కళ తప్పిందా? రెండున్నర నెలలుగా క్రీడాభిమానుల్ని అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 15వ సీజన్ అద్భుతమైన వేడుకగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేడియానికి వచ్చారు. ఫైనల్ ఈవెంట్ వేడుకల్లో మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ పాల్గొన్నారు మ్యాచ్…
ఏదైనా టోర్నీ జరుగుతున్నప్పుడు లేదా ముగిసిన తర్వాత.. మాజీలందరూ తమతమ ఉత్తమ ఆటగాళ్ళని ఎంపిక చేసుకొని, ఒక బెస్ట్ టీమ్‌ని ప్రకటిస్తుంటారు. ఇప్పుడు ఐపీఎల్-2022 ముగియడంతో.. మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన బెస్ట్ ఎలెవన్‌ను అనౌన్స్ చేశాడు. ఇతను హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. హార్దిక్ సారథ్యం వహించిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్-2022 ఛాంపియన్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే! ఈ ఏడాది సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు.. తొలి…
టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఐపీఎల్‌లో ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఫస్ట్ ఇండియన్ హెడ్ కోచ్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకూ షేన్ వార్న్, డారెన్ లెమాన్, రికీ పాంటింగ్, ట్రెవర్ బేలిస్, టామ్ మూడీ, స్టీఫెన్ ఫ్లెమింగ్, జాన్ రైట్, జయవర్ధనే వంటి విదేశీ హెడ్ కోచ్‌ల నేతృత్వంలో ఆయా జట్లు ఐసీఎల్ టైటిల్స్ గెలుచుకున్నాయి. అయితే.. తొలిసారి భారత హెడ్ కోచ్ నేతృత్వంలో ఓ జట్టు ఐపీఎల్…
ఐపీఎల్ 2022 చివరి అంకానికి చేరుకుంది. ఈ రోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దీంతో ఈ మ్యాచ్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. టైటిల్ ను ఎగరేసుకుపోయేది ఏ జట్టో ఈ రోజుతో తేలనుంది. కొత్త ఫ్రాంచైసీగా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ లీగ్ దశలో టాప్ ప్లేస్ లో నిలిచారు. సెమీస్ లో కూడా అదరగొట్టారు. టీమ్…
తమ జట్టు ఫైనల్‌కి చేరిందంటే, ఏ ఆటగాడైనా సంతోషంగా ఉండకుండా ఉంటాడా? కానీ, మాథ్యూ వేడ్ మాత్రం సంతోషంగా లేనని బాంబ్ పేల్చాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్‌కి చేరినా.. తాను సంతోషంగా లేనని, వ్యక్తిగతంగా ఈ సీజన్ తనకు చాలా చిరాకు కలిగిస్తోందని అన్నాడు. ఇందుకు ప్రధాన కారణం.. తాను సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడమేనని వెల్లడించాడు. ‘‘నాకు ఈ సీజన్ వ్యక్తిగతంగా చిరాకు తెప్పిస్తోంది. నేను సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడమే అందుకు కారణం.…
ఆది నుంచి ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ సీజన్ 2022 చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో జట్ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. అయితే నిన్న రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడి నెగ్గింది. దీంతో ఫైనల్‌లో గుజరాత్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్…
ఐపీఎల్-15 సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్, రాజస్థాన్… తొలి క్వాలిఫయర్ ఆడనున్నాయి. ఇవాళ సాయంత్రం జరగబోయే ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో… ఎవరు విజయం సాధించి… ఫైనల్‌కు చేరుకుంటారన్న దానిపై ఆసక్తి రేపుతోంది. రెండు జట్లు… లీగ్‌లో అద్భుతంగా ఆడాయి. హర్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ జట్టు లీగ్ ప్రారంభం నుంచి అద్భుత విజయాలతో నంబర్‌వన్ స్థానంలోకి దూసుకెళ్లింది. 14 లీగ్ మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానంలో…
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ఆ జట్టు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు గుజరాత్ టైటాన్స్ చెమటోడ్చింది. మొదట్లో దూకుడుగానే ఆడింది, మధ్యలో వికెట్లు పడినా పరుగుల వర్షం తగ్గలేదు, కానీ లక్ష్యానికి చేరువవుతున్న క్రమంలోనే గుజరాత్ జట్టు కాస్త పట్టు తప్పినట్టు కనిపించింది. తీవ్రంగా శ్రమించి.. చివరికి విజయం సాధించింది. ఆదివారం డబుల్ హోల్డర్‌లో భాగంగా.. తొలి మ్యాచ్ సీఎస్కే, గుజరాత్ మధ్య జరిగింది. టాస్ గెలిచిన చెన్నై,…