Irfan Pathan: అత్యుత్తమ ఐపీఎల్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏదైనా టోర్నీ జరుగుతున్నప్పుడు లేదా ముగిసిన తర్వాత.. మాజీలందరూ తమతమ ఉత్తమ ఆటగాళ్ళని ఎంపిక చేసుకొని, ఒక బెస్ట్ టీమ్‌ని ప్రకటిస్తుంటారు. ఇప్పుడు ఐపీఎల్-2022 ముగియడంతో.. మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన బెస్ట్ ఎలెవన్‌ను అనౌన్స్ చేశాడు. ఇతను హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. హార్దిక్ సారథ్యం వహించిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్-2022 ఛాంపియన్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే! ఈ ఏడాది సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు.. తొలి సీజన్‌లోనే కప్ నెగ్గడంతో సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. ముఖ్యంగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథిగా తన జట్టుని సమర్థవంతంగా నడిపించాడంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇర్ఫాన్ తను ఎంపిక చేసిన జట్టుకి హార్దిక్‌ని కెప్టెన్‌గా నియమించినట్టు తెలుస్తోంది. ఓపెనర్లుగా జోస్ బట్లర్, కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసిన ఆయన.. మూడు, నాలుగు స్థానాల్లో సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యాకు చోటు ఇచ్చాడు. అలాగే ఐదు, ఆరు స్థానాల్లో లాయమ్ లివింగ్ స్టోన్, డేవిడ్ మిల్లర్‌కు చోటు దక్కింది. ఇక బౌలింగ్ ఆల్ రౌండర్లుగా రషీద్ ఖాన్,హార్షల్ పటేల్‌ను సెలెక్ట్ చేశాడు. కేవలం బౌలర్ల కోటాలో మహ్మద్ షమీ, యజువేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం ఇచ్చాడు. అంతేకాదు.. ఈ జట్టులో 12వ ఆటగాడిగా స్పిన్నర్ కుల్ధీప్ యాదవ్ ఎంపిక చేశాడు. ఈ సీజన్‌లో ఈ వెటరన్ క్రికెటర్ మెరవడంతో.. ఇర్ఫాన్ అతడికీ తన జట్టులో చోటిచ్చినట్టు స్పష్టమవుతోంది.
Also Read
- IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
- Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
- Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
- Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
ఇర్ఫాన్ ఎంపిక చేసిన బెస్ట్ ఎలెవన్: జోస్ బట్లర్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్ (12వ ఆటగాడు- కుల్దీప్ యాదవ్). కాగా.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 130 పరుగులు మాత్రమే చేయగా, గుజరాత్ టైటాన్స్ ఇంకా 11 బంతులు మిగిలుండగానే 3 వికెట్ల నష్టంతో లక్ష్యాన్ని చేధించింది.
తాజావార్తలు
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
-
Audi Q3 2026: Audi Q3 2026 లాంచ్.. 9 ఎయిర్‌బ్యాగ్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 204hp ఇంజిన్‌తో కొత్త లగ్జరీ SUV
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!