ఐపీఎల్ 2022 చివరి అంకానికి చేరుకుంది. ఈ రోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దీంతో ఈ మ్యాచ్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. టైటిల్ ను ఎగరేసుకుపోయేది ఏ జట్టో ఈ రోజుతో తేలనుంది. కొత్త ఫ్రాంచైసీగా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ లీగ్ దశలో టాప్ ప్లేస్ లో నిలిచారు. సెమీస్ లో కూడా అదరగొట్టారు. టీమ్ వర్క్ తో గుజరాత్ రాణిస్తోంది.. టైటిల్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇదిలా ఉంటే రాజస్తాన్ జట్టులో ఓపెనర్ బట్లర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతన్ని ఆపకుంటే గుజరాత్ విజయం దూరం అయ్యే అవకాశం ఉంది. చాలా ఏళ్ల తరువాత ఫైనల్స్ కు చేరిన రాజస్తాన్ ఈ సారి కప్పు ఎలాగైనా కొట్టాలని అనుకుంటుంది. గుజరాత్ కు హర్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తేవాటియా, ఇక రాజస్తాన్ లో సంజూ శాంసన్, బట్లర్, పడిక్కల్, హెట్మెయర్ కీలకం కానున్నారు. రెండు జట్లలోను పవర్ ఫుల్ హిట్టర్లు ఉండటంతో హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది.
జట్ల అంచానా:
గుజరాత్ టైటాన్స్:వృద్ధిమాన్ సాహా (వికె), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా (సి), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (సి, వికె), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెడ్ మెక్‌కాయ్