ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ఆ జట్టు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు గుజరాత్ టైటాన్స్ చెమటోడ్చింది. మొదట్లో దూకుడుగానే ఆడింది, మధ్యలో వికెట్లు పడినా పరుగుల వర్షం తగ్గలేదు, కానీ లక్ష్యానికి చేరువవుతున్న క్రమంలోనే గుజరాత్ జట్టు కాస్త పట్టు తప్పినట్టు కనిపించింది. తీవ్రంగా శ్రమించి.. చివరికి విజయం సాధించింది.
ఆదివారం డబుల్ హోల్డర్‌లో భాగంగా.. తొలి మ్యాచ్ సీఎస్కే, గుజరాత్ మధ్య జరిగింది. టాస్ గెలిచిన చెన్నై, తొలుత బ్యాటింగ్‌కి దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులే చేసింది. రుతురాజ్ గౌక్వాడ్ (49 బంతుల్లో 53 పరుగులు), నారాయణ్ జగదీశన్ (33 బంతుల్లో 39 పరుగులు)లు మాత్రమే రాణించగలిగారు. దీంతో 134 పరుగుల లక్ష్యంతో గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగింది. ఆరంభం నుంచే గుజరాత్ దూకుడుగా ఆడింది. వృద్ధిమాన్ సాహా భారీ షాట్లతో పరుగుల వర్షం కురిపించాడు. ఆ తర్వాత అతడు కూడా నెమ్మదించాడు.
59 పరుగుల వద్ద శుబ్మన్ గిల్ (18) ఔట్ అవ్వగా.. మాథ్యూ వేడ్ (20) కాసేపు సాహాకి తోడిచ్చాడు. ఆ వెంటనే హార్దిక్ పాండ్యా (7) ఔటవ్వడంతో.. డేవిడ్ మిల్లర్, సాహా కలిసి మరో వికెట్ పడకుండా స్లోగా ఆడారు. చివరికి.. 19.1 ఓవర్ల వద్ద 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించి, గుజరాత్ విజయం సాధించింది. ఆ మధ్య ముంబై జట్టుపై చెలరేగిన తర్వాత.. ఇప్పుడు మరోసారి సాహా (67) చెలరేగిపోయి ఆడాడు.