ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని వ్యవహారంపై రచ్చ సాగుతూనే ఉంది.. ఓవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. మరోవైపు.. వికేంద్రీకరణ జరగాలి.. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్న వేళ.. విశాఖ రాజధాని కావాలంటూ.. ఓ ఉద్యమం జరుగుతోంది.. ఈ నేపథ్యంలో.. సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఉద్యమం హైదరాబాద్…
YSRCP: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి జగన్ ప్రభుత్వం పేరు మార్చడంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే బాలయ్యకు వరుసగా మంత్రులందరూ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మంత్రులు ట్వీట్లు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎప్పుడు పెట్టారో చెప్పాలని బాలయ్యను మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. మీరంతా కలిసి చంపేశాకే కదా.. చేసిన పాపం పేరు పెడితే పోతుందా అంటూ నిలదీశారు.…
Gudivada Amarnath: ఏపీ రాజధానిపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. వికేంద్రీకరణ విధానానికి బలం చేకూర్చే విధంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను గుర్తు చేయడం కోసమే సుప్రీంకోర్టుకు వెళ్లామన్నారు. మూడు రాజధానులకు న్యాయపరమైన అనుతులు పొందే దిశగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం తొలి అడుగు అన్నారు.…
Gudivada Amarnath: అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అసలు సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీకి స్వతంత్రం వచ్చిందా అని పవన్ కళ్యాణ్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తెలుగుదేశం పార్టీ నుంచి స్వతంత్రం కోసం జనసైనికులు…
AndhraPradesh-BalKrishna: విద్యుత్ వాహనాల రంగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. రానున్న కొన్నేళ్లలో 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. లైట్ హౌజ్ స్టేట్‌గా నిలవాలని ఆకాంక్షిస్తోంది. ఈ దిశగా ఇవాళంతా కీలక సమావేశం నిర్వహిస్తోంది.
టీడీపీ నేత నారా లోకేష్‌పై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడ బిడ్డ పుట్టినా నేనే నాన్న అంటూ పరుగెత్తుకుని వెళ్లేరకం లోకేష్ అని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో నాలుగు సార్లు పరిశ్రమల సమ్మిట్ పెట్టారని.. ఖర్చుల పేరుతో రూ.150 కోట్లు చూపించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఫోటోల్లో పారలు పట్టుకున్నది ఎక్కడ.. పరిశ్రమ వచ్చింది ఎక్కడో లోకేష్ చెప్పగలడా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో సూటు,…