Gudivada Amarnath: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలు అని ఆయన ఆరోపించారు. దావోస్ సదస్సుకు రాష్ట్రానికి ఆహ్వానం అందలేదనే దుష్ప్రచారాన్ని టీడీపీ ప్రారంభించిందని.. నవంబర్ 25నే ముఖ్యమంత్రి పేరు మీద ఆహ్వానం అందిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ ఏపీ అని.. 97వేల కోట్ల రూపాయలు ఏపీ నుంచి ఎగుమతులు జరిగాయని వివరించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ…
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జనసేన పేరును చంద్రసేనగా మార్చేస్తున్నట్టు చెప్పడానికే పవన్ సభ పెట్టాడన్నారు. సంక్రాంతి మామూళ్లు తీసుకుని రణ స్థలంలో ఒక ఈవెంట్ నిర్వహించి వెళ్లాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో రెండున్నర గంటలు దేశం గురించి మాట్లాడారంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. శీలం లేని పవన్ కళ్యాణ్ గంజాయి తాగి రణ స్థలంలో మాట్లాడాడని.. ఆంబోతు తోకకు మంట పెట్టినప్పుడు వేసినట్టు…
Ministers Fires on Pawan Kalyan: యువశక్తి సభలో పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేయడంపై రాష్ట్ర మంత్రులు కౌంటర్ ఎటాక్ చేశారు.. ఇక, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని స్పందింస్తూ ఘాటు వ్యాఖ్యలు చే శారు.. సభలో పవన్ కల్యాణ్ అనేక అబద్ధాలు చెప్పినప్పటికీ, ఒకటి మాత్రం నిజం చెప్పాడని అన్నారు. మరోసారి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి వీరమరణం పొందలేనని చెప్పాడని, అందులో వాస్తవం ఉందని ఎద్దేవా చేశారు. గతంలో జగన్ చేతిలో…
Gudivada Amarnath: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య బాబు కాదని.. బాలయ్య తాత అని సంభోదించారు. బాలయ్యకు 60 ఏళ్లు దాటాయని.. బాలయ్య తాతను చూడటానికి ఎవరు వస్తారని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అనుకున్నంత జనం రాలేదని.. బాలయ్య ఇంకా సమరసింహారెడ్డి కాదు ఇప్పుడు వీరసింహారెడ్డి అని గుడివాడ అమర్నాథ్ అన్నారు. జనాలు లేకే చంద్రబాబు, బాలయ్య బాబు రోడ్లపై…
Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం వెళ్లి చెత్తవాగుడు వాగుతున్నాడని.. తాము పోలీస్ యాక్ట్ ప్రకారమే జీవో ఇచ్చామని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు అసలు కుప్పంలో ఓటే లేదన్నారు. కొత్త సంవత్సరం వేళ కందుకూరు, గుంటూరులో రక్తపాతానికి చంద్రబాబు కారకుడు అయ్యాడని జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు జీవో నంబర్ 1ను చదవకుండా తమపై ఆరోపణలు చేస్తున్నారని చురకలు అంటించారు. చంద్రబాబు చతికిలపడిపోయాడని.. ఆయనలో చేవ లేదని జోగి రమేష్ ఎద్దేవా…
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాత్.. అనకాపల్లిజిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన ఫ్యాన్స్ కలలు కంటున్నారు.. అయితే, ‘సీఎం పవన్ కళ్యాణ్’ పేరుతో సినిమా తీస్తే నేనే ప్రొడక్షన్ చేస్తానన్నారు.. అంటే, పవన్ కల్యాణ్‌ను తెరపై సీఎంగా చూసుకోవచ్చు.. నిజ జీవితంలో ఆయన సీఎం కాలేరనే తరహాలో ఎద్దేవా చేశారు..…
Gudivada Amarnath: ఏపీలో పెట్టుబడులపై టీడీపీ, ఆ పార్టీ అనుకూల పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. టీడీపీని అధికారంలోకి తేవాలని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆ వార్తలు సిరాతో రాసినవి కాదని.. సారా తాగి చంద్రబాబు కోసం రాసిన వార్తలు అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అమర్ రాజా సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో రూ.9500 కోట్ల పెట్టుబడితో ఎంఓయూ చేసుకున్నారని.. ఆ సంస్థను…