పెరుగుతూ పోతున్న పెట్రో ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో.. వాటి ప్రభావం ఇతర వస్తువులపై కూడా పడుతూ పోతోంది.. అయితే, పెట్రో ధరలపై కేంద్ర ప్రభుత్వం ఓ బిగ్ స్టెప్ తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రోజురోజుకీ పెరుగుతూ పోతున్న పెట్రో ధరల నియంత్రణ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులపై ట్యాక్స్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయాన్ని ప్యానల్ ఆఫ్ మినిస్టర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.. త్వరలోనే ప్రజలకు రిలీఫ్ కలిగేవిధంగా ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. లక్నోలో శుక్రవారం జరిగే 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలోని మంత్రుల బృందం దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే, జీఎస్టీ విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్నా ప్యానల్‌లోని మూడొంతుల మంది ఆమోదం తెలపాల్సి ఉంటుంది.. ఈ కమిటీలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఉంటారు.. మరోవైపు.. కొందరు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.. మొత్తంగా శుక్రవారం జరిగే జీఎస్టీ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది ఉత్కంఠగా మారింది.