కరోనా సమయంలోనూ వరుసగా లక్ష కోట్లను దాటుతూ వచ్చిన జీఎస్టీ వసూళ్లు ఈ సారి పడిపోయాయి.. 8 నెలల తర్వాత జూన్‌లో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయల దిగువకు చేరాయి.. తాజా గణాంకాల ప్రకారం జీఎస్టీ గత నెలలో రూ. 92,849 కోట్లు వసూలైంది.. ఇందులో సీజీఎస్టీ రూ. 16,424 కోట్లు కాగా.. ఎస్‌జీఎస్టీ రూ. 20,397 కోట్లుగా ఉంది.. ఇక, ఐజీఎస్టీ రూ. 49,079 కోట్లు, వస్తువుల దిగుమతులపై రూ. 25,762 కోట్లు.. వస్తువుల దిగుమతులపై రూ. 809 కోట్లతో సహా మొత్తం రూ .6,949 కోట్ల సెస్ వసూలైనట్టు ప్రభుత్వం పేర్కొంది.. జూన్ 5వ తేదీ నుంచి జులై 5వ తేదీ మధ్య దేశీయంగా జరిగిన లావాదేవీలకు సంబంధించినవే ఈ వసూళ్లు.. అయితే, జీఎస్టీ వసూళ్లు పడిపోవడం వరుసగా ఇది రెండోసారి అయినా.. రూ. లక్ష కోట్ల దిగువకు పడిపోవడం మాత్రం.. ఎనిమిది నెలల్లో ఇదే తొలిసారి.. ఇదే సమయంలో.. గతేడాది జూన్ నెల వసూళ్లతో పోలిస్తే.. ఈసారి 2 శాతం పెరగడం విశేషంగా చెప్పుకోవాలి. కరోనాపై పోరాటంలో భాగంగా.. కేంద్రం రాయితీలు ప్రకటించడమే జీఎస్టీ వసూళ్లు తగ్గుదలకు కారణం అని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.