జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగిత్యాల ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. 16 నెలల క్రితం నవ్యశ్రీ అనే మహిళ ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రిలో చేరింది.
మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్, కోస్గి ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఆస్పత్రులు అభివృద్ధి చెందలేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు అభివృద్ధి చేస్తున్నామని, కొడంగల్, కోస్గి ఆస్పత్రుల్లో మెడికల్ సదుపాయాలు అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్.…