Doctors operated: ఆపరేషన్ చేశాడు కడుపులో క్లాత్ మరిచాడు.. 16 నెలల తర్వాత చూస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctors operated: జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగిత్యాల ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. 16 నెలల క్రితం నవ్యశ్రీ అనే మహిళ ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న తర్వాత ఇంటికి పంపించారు. అయితే ఆపరేషన్ సమయంలో మహిళ కడుపులోని గుడ్డను వైద్యులు మరిచిపోయారు. వైద్యులు గుడ్డను లోపల ఉంచి మహిళకు కుట్లు వేశారు. నవ్యశ్రీ ఏడాది నుంచి విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతూ ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంది. అక్కడి వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసిన డాక్టర్లు షాక్ కు గురయ్యారు. ఆమె కడుపులో గుడ్డ ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు వెంటనే వైద్యం చేయాలని లేదంటే ప్రాణానికే ముప్పని తెలుపడంతో కుటుంబ సభ్యులు సరే అన్నారు. దీంతో వైద్యులు వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసి గుడ్డను తొలగించారు. గుడ్డ బయటకు తీస్తుండగా వీడియో తీశారు. మహిళ పరిస్థితి ఆరోగ్యంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
నవ్వశ్రీ ఆవేదన..
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
గతంలో ప్రసవం కోసం జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి వెళ్లానని, అక్కడ వైద్యులు ఆపరేషన్ చేశారని నవ్యశ్రీ తెలిపారు. ఆపరేషన్ సమయంలో కడుపులో గుడ్డ పెట్టి బయటకు తీయడం మరిచిపోయారని చెబుతున్నారు. ఆపరేషన్ తర్వాత నవ్యశ్రీకి కడుపులో నొప్పి మొదలైంది. మొదట్లో ఆమె దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే ఇటీవల ఆమె కడుపునొప్పి తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి కడుపులోని గుడ్డను తొలగించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆ మహిళ గత కొన్ని నెలలుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంపై మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది.
RMP Doctor: ఆర్ఎంపీని అన్నాడు.. అందినకాడికి దోచుకున్నాడు
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!