వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడు ఆ దేవుడితో సమానం అంటారు. విజయవాడ ప్రభుత్వ దవాఖానాలో దారుణం జరిగింది. ఓ డాక్టర్ నిర్లక్ష్యం రోగికి ప్రాణసంకటంగా మారింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో కూలి మహిళ చేతిని తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందనే సామెతలా మారింది ఈ ఉదంతం. ఆపరేషన్లు చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన ఘటనలు చూశాం మనం, కానీ ఇప్పుడు చేతికి కట్టుకట్టి బ్లేడ్ మరిచిపోయాడా డాక్టర్. వైద్య విధానాలలో ప్రభుత్వ అనేక పెను మార్పులు తీసుకువచ్చిన నేడు డాక్టర్ల పనితీరు కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కొంతమంది డాక్టర్లు తమకున్న నైపుణ్యంతో రోగులకు మంచి వైద్యం అందిస్తారు. కానీ ఇది రివర్స్ అయింది.
Read Also: Post Office : పోస్టాఫీసులో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.2.5 లక్షల వడ్డీ
విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ నందు అయోమయ స్థితిలో పేద కుటుంబం ఉంది. తిరువూరు నియోజకవర్గం విసన్నపేట గ్రామానికి చెందిన నందిపాం సురేష్ భార్య తులసి తనకున్న పూరిల్లు సర్దుకునే సమయంలో తెలియని పురుగు ముట్టిందని అనుమానంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడనుండి మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు తర్వాత నూజివీడు డాక్టర్ల పరిశీలించి ఇన్ఫెక్షన్ ప్రారంభంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. విజయవాడలో చేతికి ఉన్న ఇన్ఫెక్షన్ తొలగించి కట్లు (డ్రెస్సింగ్) కడుతూ కట్లు మార్చే సమయంలో ఓ సర్జరీ పరికరాన్ని చేతికి వేసి కట్టడంతో చేయి పూర్తిగా ఇన్ఫెక్షన్ అయిందని మామ నందిపాం దానియేలు తెలుపుతున్నారు.
నందిపం తులసికి ఇద్దరు చిన్నపిల్లలు కావడంతో పిల్లల్ని కూలి పనులకు వెళ్లి పెంచాల్సిన పరిస్థితిలో డాక్టర్లు చేయి తీసేయాలని అనటంతో అయోమయ స్థితిలో ఉన్నావని తెలుపుతున్నారు.దీనిపై ఉన్నతాధికారులు ప్రభుత్వ స్పందించి ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడాలని బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు.
Read Also: Pm Narendramodi Tour Live: మోడీ టూర్ తో తెలంగాణలో పొలిటికల్ హీట్