భారీవర్షం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాను అతలాకుతలం చేసింది. కుండపోత వర్షం ఏలూరు నగరాన్నిముంచెత్తింది. తెల్లవారు జామునుంచి భారీగా కురుస్తున్న వర్షంతో నగరం తడిసి మద్దయ్యింది. రహదారులపై 3అడుగుల మేర వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్థంభించాయి. ఎడతెరపిలేని వర్షం కారణంగా నగరంలోని డ్రైనేజీలు పొంగిపొర్లడంతో లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇటు ఏలూరు జిల్లాలో భారీ వర్షంతో నీట మునిగింది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలో ప్రవేశించిన వర్షపు నీటితో ఇక్కట్ల పాలవుతున్నారు. చికిత్స కోసం వచ్చిన రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆస్పత్రిలోని పలు విభాగాలు నీటమునిగాయి.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజిక వర్గ వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడం వలన చిరు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్ష ప్రభావం తో రోడ్ల వెంబడి వ్యాపారం చేసుకుంటు జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారయింది. భారీవర్షాల వల్ల లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి.
Read Also: Mallu Ravi Fire on Sangareddy Collector: రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం అభినవ అంబేద్కర్ ఎలా అవుతారు?
ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈనెల 20న ఒడిసా, పశ్చిమబెంగాల్‌కు ఆనుకుని వాయవ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా ఒడిసా, తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణకోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Read Also: Palamuru TRS : టీఆర్ఎస్ ఆశావాహులు అక్కడ గందరగోళాన్ని సృష్టిస్తున్నారా..?