నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు రోగులకు స్వాగతం పలుకుతున్నాయి. ఎన్నిసార్లు సమస్యలపై ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో సమస్యలు, ఇబ్బందులతో సహాజీవనం చేస్తున్నారు పేషంట్లు, వారి అటెండర్లు. సాధారణ సమస్యలకు తోడు… ప్రభుత్వ ఆసుపత్రిలో తాగేందుకు గుక్కెడు తాగునీరు దొరకని పరిస్దితి నెలకొంది. అరగంట పైగా క్యూ లైన్లో నిలబడితే ఒక్క బాటిల్ వాటర్ దొరికితే అదే పదివేలు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గుక్కెడు తాగునీరు దొరకడం…
ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే కార్పొరేట్ ఆస్పత్రికి పరుగులు పెడుతున్న రోజులివి. కానీ సర్కారీ ఆస్పత్రుల్లో అంతకుమించిన సౌకర్యాలు వున్నాయి. ఎంతోమంది మహిళా ఉన్నతాధికారులు ప్రభుత్వాసుపత్రిలోనే డెలివరీకి వెళుతున్నారు. తాజాగా ఓ జంట ప్రభుత్వాసుపత్రి వైద్యుల సహకారంతో తల్లిదండ్రులయ్యారు. అదికూడా ఎంతో ఖరీదుగా భావించే ఐవీఎఫ్ పద్దతి ద్వారా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. బిహార్ రాజధాని పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ఆసుపత్రిలో ఈ అరుదైన సంఘటన జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే…
తెలంగాణలోని ఆసుపత్రిలో ఖాళీలను భర్తీ చేయాలని, పీహెచ్ సీల పడకల సామర్థ్యాన్ని పెంచాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోగ్య మంత్రి హరీష్ రావు కు వినతిపత్రం అందచేశారు. పేద, సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందడానికి యుద్ధ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని మంత్రిని కోరారు. శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు వినతిపత్రం అందజేశారు భట్టి…
వందేళ్ళ చరిత్ర ఉన్న ధర్మాసుపత్రి విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రి. బ్రిటీష్ కాలంలో నిర్మితమై…ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ సేవలతో విస్తరించింది. లక్షల మందికి వైద్యసేవలు అందిస్తున్న ఆ ఆసుపత్రి చుట్టూ ఇప్పుడు రాజకీయం మొదలైంది. శతాబ్ధ కాలం క్రితం పెట్టిన పేరును మార్చాలనే పొలిటికల్ డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయిని. పేరుకి ధర్మాసుపత్రే కానీ కార్పొరేట్ స్ధాయి వైద్యం అందుతుంది. ఇటీవల కాలంలో KGH…
రోడ్డు ప్రమాదాలకు, అనారోగ్యాలకు కారణమయిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తారు. కొందరు కోమాలో వుంటారు. ఆయా రోగుల పరిస్థితిని బట్టి డాక్టర్లు వైద్యం అందిస్తారు. డెత్ సర్టిఫికెట్ ఇచ్చారంటే…ఇక ఆ వ్యక్తి చనిపోయినట్టే లెక్క. కానీ యూపీలో ఓ వ్యక్తి చనిపోయినట్టుగా డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. తీరా ఆ వ్యక్తి పోస్ట్ మార్టం చేద్దామని ప్రయత్నిస్తే సదరు వ్యక్తి బతికే వున్నట్టు తేలింది. యూపీకి చెందిన 45 ఏళ్ళ శ్రీకేష్ కుమార్ మొరాదాబాద్ లో మోటార్…
గుంటూరు.. జీజీహెచ్‌లో మూడు రోజుల శిశువు అపహరణకు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది… ఈ నెల 12న కాన్పుకోసం పెదకాకానికి చెందిన ప్రియాంక అనే గర్భిణి చేరారు.. 13వ తేదీన మగ శిశువుకు జన్మనించారు.. అయితే, శుక్రవారం రాత్రి పసివాడు ఏడుస్తుండడంతో బయటకు తీసుకెళ్లింది.. ఆ శిశువు నాయనమ్మ… ఇక, బాత్రూంకు వెళ్తూ అక్కడే నిద్రపోతున్న అమ్మమ్మ పార్వతమ్మ పక్కన శిశువును వదిలి వెళ్లింది నాయనమ్మ.. కానీ, ఐదు నిమిషాల్లోనే తిరిగి వచ్చే సరికి శిశువును అపహరణకు…
పెద్దపల్లి జిల్లాలో కాళ్ళు చేతులు కట్టేసి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల వైద్యం చేసారు. అయితే ఆ వైద్యుల నిర్లక్ష్యానికి ఉత్తరాఖండ్ కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉత్తరాఖండ్ నుండి కర్నూల్ కు కూలి పనికి వెల్తుండగా ఓదెల మండలం పొత్కపల్లి వద్ద ప్రమాదవశాత్తు పడిపోయాడు అతుల్ దలి కూలి. అనంతరం 108 లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతని కాళ్ళు చేతులు కట్టేయడంతో అతుల్ దలి ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడు. దాంతో…
వైద్య విద్యార్ధిని వేధింపుల కేసులో నెల్లూరు జీజీహెచ్ మాజీ సూపరిండెంట్ ప్రభాకర్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీలు సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదిక సిఫార్సుల మేరకు సస్పెన్షన్ వేటు పడింది. జూన్ 5 తేదీన జెనా ప్రభాకర్ పై తాత్కాలిక చర్యలు తీసుకుంటూ కర్నూలు వైద్య కళాశాలకు బదిలీ చేసింది ప్రభుత్వం.వేధింపుల ఘటన పది నెలల క్రితం జరిగినట్టుగా ఉత్తర్వుల్లో పేర్కోన్న ప్రభుత్వం… రెండు కమిటీలు ఇచ్చిన నివేదిక…