తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్లకు పండగ వేళ ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ డియర్నెస్ అలవెన్స్ (DA) , డియర్నెస్ రిలీఫ్ (DR) పెంపుదలపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ విడుదల చేసిన G.O.Ms.No. 2 (ఉద్యోగులకు) , G.O.Ms.No. 3 (పెన్షనర్లకు) ప్రకారం, జూలై 1, 2023 నుండి అమల్లోకి వచ్చేలా ఈ అలవెన్స్‌లను సవరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా, పెరిగిన ఈ డీఏ , డీఆర్ వల్ల…
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ నిర్ణయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు , వారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…
AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి రోజు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి కానుకను డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కూటమి సర్కార.. ఇక, గత ఏడాది అంటే 2024 జనవరి 1వ తేదీ నుంచి డీఏ అలవెన్స్‌ను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది. అంటే, డీఏ పెంపు 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది…
CM Chandrababu: రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రధాన భాగస్వామ్యులు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి.. కొన్నింటిని సరిదిద్దే సమయంలో ప్రభుత్వం మారడంతో సమస్యలు ఎక్కడివి అక్కడే ఉండిపోయాయి.
CM Revanth Reddy : తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పిల్లలను పెంచి, చదివించి, జీవితంలో నిలదొక్కుకునేలా చేయడమే కాదు – చివరి దశలో వారికి ఆధారం కావాల్సిన పరిస్థితిలో చాలా మంది పిల్లలు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రులు బాసటకోసం ఎదురు చూస్తున్న ఈ సమాజంలో, కొందరు వారిని భారంగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ తరహా ఉదాసీనతపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారి…
Telangana : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌గా ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం క్లియర్ చేసింది. మొత్తంగా రూ.180.38 కోట్ల బిల్లులు విడుదల చేయడం ద్వారా దాదాపు 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాల…
TG Cabinet : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీ సుమారు ఐదు గంటల పాటు సాగింది. రాష్ట్ర అభివృద్ధితో పాటు, ప్రజల సంక్షేమంపై దృష్టి సారించిన ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ (డియర్‌నెస్ అలౌయెన్స్) ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనం లభించనుంది. విస్తృతంగా చర్చించి ఈ…
Bhatti Vikramarka: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముగ్గురు సీనియర్ ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు ( మే 27వ తేదీ) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో త్రిమెన్ కమిటీ అధికారుల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలను డిప్యూటీ సీఎంకు వారు వివరించారు.
TNGO: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సబ్ కమిటీ ఏర్పాటైనప్పటికీ, ఏడు నెలలు గడిచినా ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘం (TNGO) అధ్యక్షుడు జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి., సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలని పిలిచారు.. కానీ మంత్రులు…
CM Revanth Reddy: నేడు హైదరాబాద్ లో ప్రముఖ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నేతల హెచ్చరికలపై తీవ్రంగా స్పందించారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించిన ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం, ఈ సమరాలు ప్రజల మీదే అవుతాయని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మూడున్నర లక్షల మంది, మీరు చేపట్టిన సమరం 97 శాతం ప్రజల…