జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే రాకెట్ గుట్టు రట్టయింది. డ్రగ్స్ అమ్ముతూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఆరుగురు ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే విధుల నుంచి తప్పించారు.
మూడో దశ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు గుండెపోటుతో మరణించారు. వీరిలో ఒకరు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తుండగా, మరొకరు వ్యవసాయ శాఖకు చెందిన వారు.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మార్చిలో డీఏ 4 శాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పెంపుతో డియర్ నెస్ అలవెన్స్(డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ 50 శాతానికి పెరుగుతాయి. ఇండస్ట్రియల్ లేబర్ వినియోగదారుల ధరల సూచి(CPI-IW) 12 నెలల సగటు 392.83గా ఉంది. దీని ప్రకారం చూస్తే డీఏ 50.2 శాతానికి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
రేపు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం చర్చించనుంది. పెండింగ్ సమస్యల పరిష్కారంపై సమ్మె బాట పడతామని ఏపీఎన్జీవోలు హెచ్చరించడంతో ఉద్యోగ సంఘాల నేతలతో సంప్రదింపులు జరపనుంది. కాగా.. ఐఆర్, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా.. పెండింగ్ డీఏలతో పాటు రిటర్మైంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని పట్టు పడుతున్నాయి.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన భద్రత కల్పిస్తూ జగన్ సర్కార్ చట్టం చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఉద్యోగులు డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. జులైలోనే డీఏ పెరగాల్సి ఉంది. కానీ.. రెండో డీఏ ఇప్పటి వరకు పెరగలేదు.. ప్రతి ఏడాది రెండు సార్లు డీఏ పెరుగుతుంది. జనవరి, జులై రెండు సార్లు డీఏ పెరుగుతుంది. ఈ సంవత్సరం జనవరిలో పెరగాల్సిన డీఏ.. మార్చిలో పెరిగింది. ఆ తర్వాత డీఏ జులైలో పెరగాల్సి ఉంది. కానీ.. ఇంకా జులైలో పెరగలేదు. దసరా, దీపావళి…
ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం పీఆర్సీ పెంచడం దారుణమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇదేనా ఉద్యోగులను కడుపులో పెట్టుకునే చూసుకునే విధానమని విమర్శించారు. దేశంలోనే ధనిక రాష్ట్రంలో ఏమిటి దారుణమని ప్రశ్నించారు. వెంటనే 20% ఐఆర్ ప్రకటించాలన్నారు.