గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. 1.34 వేల మంది సచివాలయాల్లో పని చేస్తున్నారన్నారు. ఏక పక్ష ధోరణితో ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో సేవలు చెయ్యడానికి సచివాలయ వ్యవస్థ ఏర్పడిందని చెప్పారు.
CBI Rides: సీబీఐ న్యూఢిల్లీ బృందం దేశంలోని అనేక ప్రాంతాలలో దద్దులు చేసింది. ఇందులో భాగంగా.. భువనేశ్వర్ లోని రామమందిరం సమీపంలో ఉన్న బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ లిమిటెడ్‌పై సీబీఐ న్యూఢిల్లీ బృందం ఈరోజు దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసింది. ఒడిశాలోని 5 ప్రాంతాలతో సహా భారతదేశంలోని 11 ప్రదేశాలలో ఏకకాలంలో దాడులు జరిగాయి. భువనేశ్వర్, కటక్, ఛత్రపూర్ లో దాడులు జరగగా.. ఒడిశా అండ్ పశ్చిమ బెంగాల్ బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ…
కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా వయో పరిమితిని పెంచారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. విచారణలో ఈ వాదన తప్పు అని తేలింది. ఇంతకు ముందు కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని తెలిసింది.
No Smoking: కర్నాటక ప్రభుత్వం తమ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాంగణాలలో సిగరెట్లు తాగడం లేదా పొగాకు ఉత్పత్తులను సేవించడంపై నిషేధం విధించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ (DPAR) జారీ చేసిన సర్క్యులర్‌లో ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చట్టబద్ధమైన హెచ్చరికలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా కార్యాలయ ఆవరణలో పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన హెచ్చరిక బోర్డును…
Telangana: తెలంగాణ ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) ను 3.64 శాతం పెంచుతూ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ జీతంతో పాటు ఈ పెరిగిన డీఏ చెల్లించనున్నారు. 2022 జులై 1 నుండి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ…
ప్రభుత్వ ఉత్తర్వులు, రిమైండర్‌లు ఉన్నప్పటికీ మానవ్ సంపద పోర్టల్‌లో తమ ఆస్తుల వివరాలను ఇవ్వని యూపీలోని 2 లక్షల 44 వేల 565 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. వీరికి ఆగస్టు నెల జీతం నిలిచిపోయింది.
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS) పథకం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ చూసి గర్విస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదిక 'X'లో తెలిపారు. 'ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS).. ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వబోతోంది. ఈ చర్య వారి సంక్షేమం.. సురక్షితమైన భవిష్యత్తు పట్ల మా ప్రభుత్వ…
Employee Transfer: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలపై కసరత్తు కొనసాగుతుంది. విద్య, వైద్య శాఖలు మినహా 15శాఖల్లో బదిలీలు కొనసాగనున్నాయి. పైరవీలు, అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీలు చేపట్టాలని మంత్రులు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే రాకెట్ గుట్టు రట్టయింది. డ్రగ్స్ అమ్ముతూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఆరుగురు ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే విధుల నుంచి తప్పించారు.