CM Chandrababu: రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రధాన భాగస్వామ్యులు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి.. కొన్నింటిని సరిదిద్దే సమయంలో ప్రభుత్వం మారడంతో సమస్యలు ఎక్కడివి అక్కడే ఉండిపోయాయి.. మొత్తం 7 వేల కోట్ల రూపాయల DA పెండింగ్ లో ఉంది.. సరెండర్ లీవ్ కు రూ. 830 కోట్లు బకాయిలు ఉన్నాయి.. గత ప్రభుత్వ హయంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేయడానికి 15 నెలలు పట్టింది.. ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు రాష్ట్ర అభివ్రుద్ది లో ప్రధాన భాగస్వాములు.. విభజన వల్ల చాలా స్ట్రక్చరల్ ఛేంజస్ వచ్చాయి.. ఉద్యోగులు ఎక్కువ వచ్చారు ఆదాయం తగ్గింది.. ఉద్యోగులకు రూ. 34 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి.. 4 డీఏలు పెండింగ్ ఉన్నాయి.. రూ. 7000 కోట్ల రూపాయలు డీఏ బకాయిలు వచ్చాయి.. రాష్ట్రాలు క్యాపిటల్ ఎక్సెపెండిచర్ పెంచి ఆదాయాలు పెంచుకుంటే మన వద్ద రివర్స్ అయ్యింది.. ఎక్సైజ్ లో భవిష్యత్తు ఆదాయంపైనా అప్పు తెచ్చారు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Shivani Nagaram : ఆ హీరో కోసం ఏం చేయడానికైనా రెడీ.. క్రేజీ హీరోయిన్ కామెంట్
ఇక, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ప్రకటించింది. నాలుగు పెండింగ్ డీఏలకు గాను ఒక డీఏను ఇవ్వడానికి ఒప్పుకుంది. నవంబర్ 1 నుంచి ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.. దీని కోసం ప్రతి నెలా రూ.160 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అలాగే, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ ను 180 రోజులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. రిటైర్ అయ్యేలోపు ఎప్పుడైనా ఈ చైల్డ్ కేర్ లీవ్ తీసుకునే అవకాశం కల్పించారు. అయితే, మొత్తం ఉద్యోగులకు కలిసి రాష్ట్ర రెవెన్యూలో 99.50 శాతం జీతభత్యాలకు పోతోంది అన్నారు. రూ. 51,200 కోట్లు ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేయాల్సి వస్తుంది.. దాపరికం ఏమీ లేదు, ఎవరినీ పట్టించుకోని పరిస్థితి లేదు.. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. ఈ ఏడాది రూ. 51, 400 కోట్లు రాష్ట్ర ఆదాయం అయితే రూ. 51, 200 కోట్లు జీతాల రూపేణా ఇచ్చామన్నారు. మన రాష్ట్రంలో 99 శాతం రెవెన్యూ HR కే వెళ్తుందన్నారు. రాష్ట్రాల రెవెన్యూలో కేరళ 68 శాతం, తెలంగాణ 38 శాతం, తమిళనాడు 42, కర్ణాటక 38 శాతం జీతభత్యాలకు ఇస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.