TG Cabinet : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీ సుమారు ఐదు గంటల పాటు సాగింది. రాష్ట్ర అభివృద్ధితో పాటు, ప్రజల సంక్షేమంపై దృష్టి సారించిన ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ (డియర్‌నెస్ అలౌయెన్స్) ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనం లభించనుంది. విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
TPCC Mahesh Goud : మల్లు రవిపై ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిస్తాం
హైదరాబాద్ మెట్రో రైల్వే రెండో దశ విస్తరణపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. నగర అభివృద్ధికి మెట్రో సేవలు మరింత విస్తరించాలని భావించిన కేబినెట్, సంబంధిత ప్రణాళికలపై చర్చలు జరిపింది. ములుగు జిల్లా ఇంచర్లలో ఏర్పడనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు ప్రమాద బీమా మరియు లోన్ బీమా చెల్లింపుల కోసం రూ.70 కోట్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా మహిళా బృందాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల ఆధునీకరణను ‘హమ్ విధానం’ ద్వారా చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజల అవసరాలపైనే కేంద్రీకృతమై ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.
Sudhakar Naidu: టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్యకు కుట్రలో ట్విస్ట్…!