Dhavaleshwaram project: గోదావరి నదిపై ఏపీలో నిర్మించిన ధవళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా ఈ ప్రాజెక్టు గుర్తింపు పొందింది.
గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది.. ఇప్పటికే భద్రచలం దగ్గర 51 అడుగులకు పైగా గోదావరి ప్రవాహం కొనసాగుతుండగా.. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. ధవళేశ్వరం దగ్గర గోదావరి నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది.. ఇక, కోనసీమ లంక గ్రామాలను అప్రమత్తం చేసింది అధికార యంత్రాంగం.. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో మళ్లీ వరద కష్టాలు మొదలయ్యాయి.. Read Also:…
విలీన మండలాల్లో పోలవరం నిర్వాసితులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. ఓవైపు గోదావరి ముంచెత్తుతుంటే.. అదే ముంపులో నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు.. అల్లూరి జిల్లా విలీన మండలాల్లో పోలవరం నిర్వాసితుల ఆందోళనలు హోరెత్తుతున్నాయి..నిన్న చింతూరు వరద నీటిలో ధర్నాకు దిగిన నిర్వాసితులు.. తాజాగా ఈ రోజు వి.ఆర్.పురంలో వద్ద భారీగా ఉన్న వరద నీటిలో ఆందోళన చేపట్టారు.. విలీన మండలాల్లో ప్రతి సంవత్సరం సంభవించే వరదలకు తాము అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకునే నాథుడే కారువయ్యాడని ఇక్కడి నిర్వాసితులు లబోదిబోమంటున్నారు.…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లా పర్యాటనలో అపశృతి చోటు చేసుకుంది.. రాజోలు మండలం సోంపల్లి రేవులో బోటు దిగుతుండగా నీటిలో పడిపోయారు టీడీపీకి చెందిన 15 మంది నేతలు.. చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది.. మాజీ మంత్రులు, టీడీపీ నేతలు నీటిలో పడిపోయారు.. దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, రాధాకృష్ణ, అంగర రామ్మోహన్, మంతెన రామరాజు నీటిలో పడి తడిసి ముద్దయ్యారు.. ఇందులో పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.. నీటిలో పడినవారిలో పోలీసు…
గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో.. మరోసారి పోలవరం ప్రాజెక్టు, పోలవరం ముంపు ప్రాంతాల వివాదం తెరపైకి వచ్చింది.. ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని, పోలవరం ఎత్తును తగ్గించాలనే డిమాండ్ తెలంగాణ నుంచి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి వినిపిస్తుండగా.. ఏపీ నుంచి దీనిపై కౌంటర్‌లు పేలుతున్నాయి.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పోలవరం మీద తెలంగాణతో పాటు ఢిల్లీ వాళ్లు దిగివచ్చినా..…
Polavaram Project Upper Cofferdam: ఇటీవల గోదావరి నదికి అనూహ్య స్థాయిలో వరదలు రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. దిగువ కాఫర్ డ్యాంపైకి నీరు ఎగదన్నింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టులో ప్రధాన జలాశయం నిర్మించాల్సిన ప్రదేశానికి ఎగువన నిర్మించిన కాఫర్ డ్యామ్ను ఎత్తును పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు 1 మీటరు పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జూలై15న ఎగువ కాఫర్…