ఎగువ నుంచి భారీ వరదలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది.. లంక గ్రామాలను గోదావరి ముంచెత్తుతోంది.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 15.20 అడుగులకు చేరింది నీటిమట్టం.. దీంతో, రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు అధికారులు.. బ్యారేజీ నుండి 15 లక్షల 21 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.. అయితే, గడిచిన 24 గంటలూగా గోదావరిలో అదే పరిస్థితి కొనసాగుతోంది.. అయితే, ధవళేశ్వరం దగ్గర 11.75 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ…
ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఉత్తర కోస్తా నుంచి ఏలూరు వరకు కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ ఏడాది గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయని.. జూలై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద వచ్చిందని సీఎం జగన్ అన్నారు. ఇప్పడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందని.. బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. గోదావరిలో వరద16 లక్షల క్యూసెక్కులకు…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఏపీలోని పులిచింతలకు 11 వేల 548 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33.8 టీఎంసీల వద్ద ఉంది. కర్నూల్ జిల్లా హోస్పేటలో ఇవాళ తుంగభద్ర నది గేట్లు ఎత్తనున్నారు. ఈ జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 87 వేల 305 క్యూసెక్కులు కాగా…
రోడ్డు పక్కన బైక్ పార్క్ చేసి వెళ్తున్నారా.. రద్దీ ప్రాంతాల్లో ఏదో ఒక మూల కార్ నిలిపి షాపింగ్ కి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త. ఎక్కడ పడితే అక్కడ కార్, బైక్ పార్క్ చేసి వెళ్తే ఇక పై కుదరదంటూ హెచ్చరిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కార్పోరేషన్ అధికారులు.. రద్దీ ప్రాంతాల్లో ఇక పై పార్కింగ్ చేసే వాహనాలపై ఫీజు వసూలు చేసేందుకు సిధ్దమవుతున్నారు. ఇప్పటికే ఎడాపెడా పన్నులతో ఇబ్బందులు పెడుతున్న మున్సిపల్ కార్పోరేషన్ పార్కింగ్…
మహా శివరాత్రినాడు విషాదం నెలకొంది. పర్వదినం సందర్భంగా గోదావరి స్నానానికి వెళ్ళి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్ట్ ఇంటెక్వెల్ సమీపంలోఈ సంఘటన జరిగింది. గల్లంతయిన యువకుడిని భూక్యా సాయి(20 )గా బంధువులు గుర్తించారు. అతని మృతదేహం లభించడంలో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కమలాపురం టీడీపీ కాలనీకి చెందిన భూక్య సాయి తమ బంధువులు, చట్టుప్రక్కల ఇళ్ళవారితో కలిసి మంగళవారం ఉదయం గోదావరి స్నానం చేయడం కోసం వెళ్ళారు. గోదావరిలో…