ఉభయగోదావరి జిల్లాలలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో కూనవరం బ్రిడ్జి వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జిపై నుంచి గోదావరి పరుగులు తీస్తోంది. ఇప్పటికే బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేయగా.. ప్రజలు కాలినడకన బ్రిడ్జి దాటుతున్నారు. అటు గోదావరి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది. 24 గంటల పాటు గోదావరి ప్రవాహం.. వరద ముంపును మానిటర్ చేస్తోంది.…
గోదావరి వరదలు – సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏరియల్ సర్వే తర్వాత ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు ఇతర అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు కార్తికేయ మిశ్రా. తూర్పుగోదావరి జిల్లాకు అరుణ్‌కుమార్, డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ప్రవీణ్ కుమార్, ఏలూరు జిల్లాకు కాటమనేని భాస్కర్‌ను నియమించారు. వచ్చే 24 గంటలు చాలా కీలకమని..…
గోదావరిలో అంతకంతకు వరద ఉధృతి పెరుగుతూనే ఉంది.. ఎగువన భద్రాచలం వద్ద గంటగంటకు గోదావరి ప్రవాహం పెరుగుతూ.. మూడో ప్రమాదహెచ్చరిక స్థాయిని దాటుతుండగా.. పోలవరం ముంపు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఇక, ధవళేశ్వరం దగ్గర కాటన్ బ్యారేజీకి భారీ స్థాయిలో వరదనీరు వచ్చిచేరుతోంది.. దీంతో.. అదేస్థాయిలో సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. గోదావరి వరద ఉధృతి కారణంగా ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది..…