వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానలకు నదులు, ప్రాజెక్టు, నిండి జన జీవనం అతలాకుతలంగా మారింది. పలు జిల్లాలకు, గ్రామాలకు, రాష్ట్రాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అయితే.. భద్రాచలంలో ప్రమాదకరస్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. భద్రాచలం లో 70 అడుగుల చేరువలో గోదావరి 68 అడుగుల వరద నీరు తాకింది. కాగా.. 67 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. గోదావరిలోకి 21 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో.. ముందస్తుగా ఊహించినట్లే 73 అడుగులు దాటే…
గోదావరి నీళ్లతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి పాదాలు కడగాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ నుంచి యాదాద్రికి అధికారులు నీరు విడుదల చేశారు. ఈ మేరకు ఆఫ్టేక్-2 నుంచి గోదావరి జలాలు యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లికి చేరుకున్నాయి. అటు నుంచి ఈ గోదావరి జలాలు యాదాద్రి నారసింహుడి చెంతకు చేరాయి. యాదాద్రి ఆలయంలో పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభమైన రోజే గండి చెరువును అధికారులు కాళేశ్వరం నీటితో నింపారు.…
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 2,603 రైతు వేదికలను దేశంలో ఎక్కడాలేని విధంగా నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. రైతులను సంఘటితం చేసి, తద్వారా వచ్చే లాభాన్ని తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో 6…
కేంద్ర జల్‌శక్తి శాఖ ఈ రోజు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సీఎస్‌లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి బోర్డులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది. సీడ్ మనీ రూ.200 కోట్లను విడతల వారీగా ఇస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు నెలలకొసారి చెల్లింపులు చేస్తామని ఏపీ ప్రతిపాదించింది. అంతేకాకుండా కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ తక్షణమే అమలు చేయాలని…
నిజామాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి ప్రశాంత్ రెడ్డి రైతులకు చేతులెత్తి మొత్తుకున్నారు. కాళేశ్వరం ప్యాకేజ్ 20,21,21A పనుల పురోగతి పై కలెక్టరేట్ లో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దీనికి ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. ఆర్మూర్, బాల్కొండ,మెట్ పల్లి మెట్ట ప్రాంత రైతులకు మరో రెండు నెలల్లో గోదావరి జలాలు అందిస్తాం అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. 80 కిలోమీటర్లు పైపు లైన్ పనులు పూర్తి చేశామని వివరించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. రైతులకు చేతులెత్తి…
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.. భద్రాచలం దగ్గర 43 అడుగులకు చేరింది గోదావరి నీటిమట్టం.. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. గోదావరి పరివాహక ప్రాంతాలను అలర్ట్ చేశారు.. ఇక, అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు.. ఇటు, దేవీపట్నం మండలంలోని 33 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. పోలవరం ప్రాజెక్టు దగ్గర కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.. ఎగువ కాపర్ డ్యామ్పై గోదావరి ఉగ్రరూపం…