ఉమ్మడి నల్లగొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం గుర్తింపు అన్నారు. ఆకలి తీర్చే ఆయుధమని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నల్గొండ చరిత్రే.. తెలంగాణ చరిత్ర అని కొనియాడారు. జిల్లా అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్లు అవకాశం ఇస్తే గోదావరి నీళ్లు తుంగతుర్తికి ఎందుకు తేలేదు..? అని ప్రశ్నించారు.
READ MORE: Kota : కోట శ్రీనివాసరావును పడేసి కొట్టబోయిన ఎన్టీఆర్ అభిమానులు..ఎందుకో తెలుసా ?
పదేళ్లు అధికారంలో ఉన్నా పేదలకు రేషన్ కార్డు, సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన బీఆర్ఎస్ నేతలకు రాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3.10 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేశామని.. రేషన్ దుకాణాల వద్ద జనాలు బారులు తీరుతున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చామని.. వ్యవసాయం దండగ కాదు.. పండగలా చేశామన్నారు. దేశం తలెత్తుకునేలా వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. రైతు రాజు అయినప్పుడే ఇందిరమ్మ ఆత్మశాంతిస్తుందని ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం గోదావరి నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు.. ఇప్పుడు సీఎం వస్తే అడ్డుకుంటామంటున్నారని తెలిపారు. గతంలో 3 రోజులు అవకాశమిస్తే తుంగతుర్తికి జలాలు తెస్తామన్నారని… పదేళ్లు అవకాశం ఇచ్చినా దేవాదుల నుంచి నీళ్లు తేలేదని విమర్శించారు.
READ MORE: Indian Army: ఉల్ఫా ఉగ్రవాదులపై ‘‘సర్జికల్ స్ట్రైక్స్’’తో మాకు సంబంధం లేదు: భారత సైన్యం
“గత ప్రభుత్వం సహాయక సంఘాలను పట్టించుకోలేదు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ బంకులు అప్పగించాం. ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ పవర్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మూడు అగుడుల వ్యక్తి నన్ను అడ్డుకుంటానని అంటున్నాడు. గ్లాసులో సోడా పోసినంత ఈజీ కాదు.. గోదావరి నీళ్లు తేవడం. ఒక్కసారి అడ్డుకుని చూడు, మా దామన్న చూసుకుంటాడు. 10 ఏళ్లు అధికారం ఇస్తే గోదావరి నీళ్లు ఎందుకు తీసుకురాలేదు. రైతు భరోసా ఇవ్వలేదని రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి దొంగ ఏడుపులు ఏడ్చారు. కానీ తొమ్మిది రోజుల్లో అందరికీ రైతు భరోసా ఇచ్చాం.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.