Andhra Pradesh: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని దగ్గర గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతు అయ్యారు.. ఓ పెళ్లికి హాజరు అయ్యి తిరిగి వెళ్తుండగా.. గోదావరిలో సరదాగా గడపడానికి వెళ్లారు స్నేహితులు.. కె.గంగవరం మండలం శేరుల్లంక గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన కాకినాడ, రామచంద్రపురం, మండపేట గ్రామాలకు చెందిన స్నేహితులు.. సమీపంలో గోదావరిలో స్నానానికి దిగారు.. మొత్తం 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగగా.. వీరిలో ఎనిమిది మంది గల్లంతు అయ్యారు.. వీరిలో కాకినాడకు చెందిన నలుగురు క్రాంతి (20), పాల్ (18), సాయి (18) సతీష్ (19).. ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన మహేష్, రాజేష్ (13), మండపేటకు చెందిన రోహిత్, శేరుల్లంకకు చెందిన మహేష్‌లు ఉన్నారు.. దీంతో, శోకసంద్రంలో మునిగిపోయాయి ఆయా కుటుంబాలు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు..
Read Also: Bihar: ‘‘ఎన్నికల డ్రామా’’.. అన్ని తెలిసీ నాతో ఎందుకు పెళ్లి చేశారు..? లాలూ మాజీ కోడలు ఆగ్రహం..
ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద స్నానానికి వెళ్లి ఎనిమది మంది యువకులు గల్లంతైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి వాసంశెట్టి సుభాష్.. గల్లంతైన యువకుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అన్నారు.. యువకుల గల్లంతుపై అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.. బాధిత కుటుంబాలకు ధైర్యంగా ఉండాలని అవసరమైన సహాయం అందిస్తామని ధైర్యం చెప్పారు మంత్రి వాసంశెట్టి సుభాష్..