ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంకు సమయం దగ్గరపడుతోంది. డిసెంబరు 16న అబుదాబిలో మినీ వేలం జరగనుంది. వేలంలో 1,355 మంది ప్లేయర్స్ తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది. 10 జట్లలో కలిపి 77 స్లాట్‌లు ఖాళీగా ఉండగా.. ఇందులో విదేశీ ప్లేయర్ల స్లాట్‌లు 31 కావడం విశేషం. రిజిస్ట్రేషన్ లిస్ట్‌లో 14 దేశాల నుంచి ఆటగాళ్లు ఉండగా.. మినీ వేలానికి రికార్డ్ రిజిస్ట్రేషన్స్ రావడం గమనార్హం. రిజిస్ట్రేషన్…
Glenn Maxwell : గ్లెన్ మాక్స్వెల్, ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో తనదైన ముద్ర వేసాడు.ముందు కొండంత లక్ష్యం వున్నా అలవోకగా ఛేదిస్తాడు. ఇక టార్గెట్ చేయాలన్నా తనదైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతుంటాడు. ఇక బ్యాటెర్ గానే కాకుండా బౌలర్ కూడా వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటాడు. ఇలా.. గ్లెన్ మాక్స్వెల్ ఐపీఎల్ లో తనదైన ముద్ర వేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్ లో ఆడుతున్నాడు.…
2025 ఐపీఎల్ ఫైనల్ లో భాగంగా ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించి తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. చివరివరకు జరిగిన ఉత్కంతపోరులో పంజాబ్ తొలి టైటిల్ కోసం పోరాడి ఓడింది. ఈ ఓటమితో ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతిజింటా ముగ్గుర్ని ఎలిమినేటి చేసేందుకు సిద్దమైందట. భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఎవరు? వాళ్ళ ప్రదర్శన ఎలా ఉంది? వచ్చే వేలంలో అనుసరించాలని వ్యూహాలపై ప్రీతి ఇప్పటినుంచే లెక్కలు వేసుకుంటుందట.…
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికాడు. దీంతో మ్యాక్సీ 13 ఏళ్ల వన్డే కెరీర్ ముగిసింది. ఫైనల్ వర్డ్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంను వెల్లడించాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ధ్రువీకరించింది. ఆస్ట్రేలియా తరపున 2012లో వన్డేల్లోకి అడుగుపెట్టిన 36 ఏళ్ల మాక్స్‌వెల్.. ఇప్పటివరకు 149 మ్యాచ్‌లు ఆడాడు. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి టెస్టులకు కూడా దూరంగా ఉన్నాడు. ఇక మాక్స్‌వెల్ కేవలం…
Preity Zinta : ఈ సీజన్ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతుంది. 11 మ్యాచుల్లో 7 గెలిచి 15 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మెగా వేలానికి ముందు కేకేఆర్ విడుదల చేయడంతో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం శ్రేయాస్ అయ్యర్ ని 26 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. ఓ వైపు బ్యాటర్ గా పరుగులు సాధిస్తూనే సారధిగా జట్టును సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపిస్తున్నాడు. అయ్యర్ ఇప్పటివరకు 11 మ్యాచులో 405 పరుగులతో…
చేతి వేలి గాయం కారణంగా పంజాబ్ కింగ్స్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ఇటీవల ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో మరో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ ఓవెన్‌ను పంజాబ్ జట్టులోకి తీసుకుంది. మిచెల్‌ను రూ.3 కోట్లకు పంజాబ్ తీసుకున్నట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2025లో మిచెల్ ఆడుతుండడం విశేషం. మే 9 వరకు పీఎస్‌ఎల్ 2025లో మిచెల్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) రసతవత్తరంగా సాగుతోంది. రోజు రోజుకూ అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతూ వస్తోంది. ఈ సీజన్‌లో చాలా మంది ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. కానీ.. మంచి ప్రదర్శన ఇస్తారని భావించిన కొంత మంది ఆటగాళ్ళు మాత్రం నిరాశ పరుస్తున్నారు. వీళ్లను భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించి కొన్నా.. వీరి ప్రదర్శన ఇప్పటివరకు పేలవంగా ఉంది. ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఇలాంటి 5 మంది ఆటగాళ్ల…
ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్ ఐపీఎల్‌లో కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగి.. 10 మ్యాచులలో 52 పరుగులు మాత్రమే చేశాడు. గతేడాది తీవ్రంగా నిరాశపర్చిన మ్యాక్సీని ఆర్సీబీ వేలంలోకి వదిలేయగా.. పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. సీజన్, ఫ్రాంచైజీ మారినా మ్యాక్స్‌వెల్ ప్రదర్శనలో మాత్రం మార్పు లేదు. ఐపీఎల్ 2025లో మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. గుజరాత్…
ఐపీఎల్ 2024లో ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తీవ్రంగా నిరాశపర్చిన విషయం తెలిసిందే. 10 మ్యాచులలో 52 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలం ముందు మ్యాక్సీని బెంగళూరు వదిలేయగా.. పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. గతంలో పంజాబ్ తరఫున ఆడిన మ్యాక్స్‌వెల్‌పై ఆ ప్రాంచైజీ భారీ ఆశలు పెట్టుకుంది. ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్ 2025లో మొదటి మ్యాచ్ ఆడిన మ్యాక్స్‌వెల్.. గోల్డెన్ డక్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ సాయి కిశోర్…
IPL History: మార్చి 22 నుండి ఐపీఎల్ 2025 సీజన్ మొదలు కానున్న విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత్ విజయ కేతనం ఎగురవేయగా.. ఆ తరవాత టీమిండియా ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కు సన్నధమ్మ అవుతున్నారు. ఇప్పటికే అన్ని టీమ్స్ ప్రాక్టీస్ ను కూడా మొదలు పెట్టేశాయి కూడా. ఇక ఐపీఎల్ సంబంధించిన విశేషాలు చాలానే ఉన్నాయి. నిజానికి మనకు ఐపీఎల్ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది…