ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రాంచైజీ ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు), రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు), యశ్ దయాళ్ (రూ.5 కోట్లు)ను ఆర్‌సీబీ అట్టిపెట్టుకుంది. చాలామంది స్టార్ ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. 2021 నుంచి జట్టులో ఉన్న ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ రిటైన్ చేసుకోలేదు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్‌సీబీ తనను అట్టిపెట్టుకోవడంపై తాజాగా మ్యాక్సీ స్పందించాడు.…
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ మంచి ఫ్రెండ్స్.. వీరిద్దరూ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున ఆడుతున్నారు. అయితే.. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అకౌంట్‌ను బ్లాక్ చేసినట్లు మ్యాక్స్‌వెల్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. అందుకు గల కారణమేంటో మ్యాక్సీ చెప్పుకొచ్చాడు.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రశంసలు కురిపించాడు. తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ బుమ్రానే అని తెలిపాడు. ప్రపంచంలోనే అన్ని ఫార్మాట్లలో ఆల్‌టైమ్ బెస్ట్ బౌలర్‌గా ఎదుగుతున్నాడన్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం బుమ్రా సొంతం అని మ్యాక్స్‌వెల్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టు, ఐపీఎల్ మ్యాచ్‌లలో చాలాసార్లు బుమ్రా బౌలింగ్‌ను మ్యాక్సీ ఎదుర్కొన్నాడు. ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో షేర్ చేసిన వీడియోలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ… ‘నేను ఎదుర్కొన్న…
Aakash Chopra About RCB Retention for IPL 2025: ఈ ఏడాది డిసెంబర్‌లో ఐపీఎల్ 2025కి సంబంధించి మెగా వేలం జరగనుంది. రిటెన్షన్‌కు సంబంధించి ఇటీవల బీసీసీఐ, ప్రాంచైజీల మధ్య భేటీ జరగగా.. భారత క్రికెట్ బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే రిటెన్షన్‌కు సంబంధించి బీసీసీఐ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ ద్వారా ఎంతమంది క్రికెటర్లకు అవకాశం ఇస్తారనే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఐపీఎల్…
Glenn Maxwell Unwanted Record in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా ఆర్‌సీబీ మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్‌తో కలిసి మ్యాక్సీ సమంగా నిలిచాడు. ఐపీఎల్‌లో డీకే, మాక్స్‌వెల్ 18 సార్లు డకౌట్ అయ్యారు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్…
Glenn Maxwell Fans Trolls Parthiv Patel: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో 36 రన్స్ మాత్రమే చేశాడు. సీజన్ ఆరంభంలో ఆడిన మ్యాక్సీ.. కొన్ని మ్యాచ్‌లకు విరామం తీసుకున్నాడు. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. మూడు బంతుల్లో ఒక ఫోర్ బాది పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాక్స్‌వెల్ ఆట తీరుపై టీమిండియా మాజీ ప్లేయర్ పార్థివ్…
Glenn Maxwell Take A Break From IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ నుంచి కొన్ని రోజలు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం మ్యాక్సీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఐపీఎల్ 17వ సీజన్‌కు అతడు మళ్లీ అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. ఐపీఎల్ 2024లో మ్యాక్స్‌వెల్…
Glenn Maxwell imitating Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. శుక్రవారం (మార్చి 22) చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెపాక్‌లో ముమ్ముర సాధన చేస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం మంగళవారం రాత్రి ఆర్‌సీబీ జట్టు చెన్నైకి చేరుకుని ప్రాక్టీస్…
Glenn Maxwell under investigation by CA: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా అడిలైడ్‌లో రాత్రిపూట పూటుగా మద్యం సేవించిన మాక్స్‌వెల్.. అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సీరియస్ అయ్యింది. మాక్స్‌వెల్‌ను దర్యాప్తుకు రావాలని సీఏ ఆదేశించింది. ప్రస్తుతం ఈ సంఘటనపై సీఏ విచారణ జరుపుతోందని తెలుస్తోంది. ఆస్పత్రి పాలైన మ్యాక్స్‌వెల్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని తెలుస్తోంది. బీబీఎల్ 2024లో మెల్‌బోర్న్ స్టార్స్…
Glenn Maxwell Equals Josh Inglis, Aaron Finch Fastest T20I Century Record: ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అనూహ్య విజయం సాధించింది. అసాధారణ బ్యాటింగ్‌తో కొండత లక్ష్యాన్ని చేధించిమన ఆసీస్.. చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. హార్డ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (104 నాటౌట్; 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్స్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ 5…