2025 ఐపీఎల్ ఫైనల్ లో భాగంగా ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించి తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. చివరివరకు జరిగిన ఉత్కంతపోరులో పంజాబ్ తొలి టైటిల్ కోసం పోరాడి ఓడింది. ఈ ఓటమితో ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతిజింటా ముగ్గుర్ని ఎలిమినేటి చేసేందుకు సిద్దమైందట. భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఎవరు? వాళ్ళ ప్రదర్శన ఎలా ఉంది? వచ్చే వేలంలో అనుసరించాలని వ్యూహాలపై ప్రీతి ఇప్పటినుంచే లెక్కలు వేసుకుంటుందట.
Also Read:Rahul Ramakrishnan : డైరెక్టర్ గా మారుతున్న మరో స్టార్ కమెడియన్
వచ్చే సీజన్లో టైటిలే లక్ష్యంగా జట్టుని సంసిద్ధం చేయాలనుకుంటుంది. అందులో భాగంగా కొందర్ని వేలంలోకి వదిలేసి, మ్యాచ్ విన్నర్లను జట్టులోకి తీసుకోవాలనుకుంటుంది. ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను పంజాబ్ 11 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ స్టోయినిస్ ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఆడిన 13 మ్యాచ్‌ల్లో 186 స్ట్రైక్ రేట్ తో 160 పరుగులు చేశాడు. అతనిపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ స్టోయినిస్ ఆకట్టుకోలేదు. దీంతో వచ్చే వేలంలో స్టోయినిస్ ను వేలంలోవదిలేసేందుకు ప్రీతిజింటా సిద్దమైనట్లు తెలుస్తుంది. పంజాబ్ కింగ్స్ విడుదల చేయాలనుకుంటున్న ఆటగాళ్లలో ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఉన్నాడు.
Also Read:Anirudh : కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి వార్తలు.. స్పందించిన టీమ్
మాక్సీని పంజాబ్ 4 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ మ్యాక్స్ వెల్ ప్రీతిజింటాను మెప్పించలేకపోయాడు. 7 మ్యాచులు ఆడి 48 పరుగులు చేశాడు. అటు బౌలింగ్ పరంగా పెద్దగా సాధించిందేమీ లేదు. 7 మ్యాచుల్లో 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో మ్యాక్స్ వెల్ ని పంజాబ్ యాజమాన్యం వదిలించుకునే అవకాశం ఉంది. ఇక ఈ జాబితాలో ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్ కూడా ఉన్నాడు. పంజాబ్ అతన్ని1.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఠాకూర్ కి 2 మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం వచ్చింది. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 12.15 ఎకానమీతో ఒక వికెట్ మాత్రమే తీశాడు. దీంతో ఠాకూర్ ను కూడా పంజాబ్ వదిలించుకోవాలనుకుంటుంది.