ఆర్సీబీ కల ఈసారి కూడా నెరవేరలేదు. మరో ఐపీఎల్ అలా వచ్చి ఇలా వెళ్లింది. అయినా ‘ఈ సాలా కప్ నమదే’ అన్న నినాదం ఆర్సీబీ అభిమానుల మది నుంచి వెళ్లిపోవడం లేదు. దీంతో మరో ఏడాది కోసం వాళ్లంతా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు ఆర్సీబీ ఓటమికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫామ్ ఆర్సీబీ జట్టును దారుణంగా దెబ్బతీసింది. ప్లే ఆఫ్స్‌లో కోహ్లీ కనుక…
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ శుక్రవారం నాడు తన గర్ల్‌ఫ్రెండ్, భారతీయ యువతి వినీ రామన్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని మ్యాక్స్‌వెల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తమిళనాడుకు చెందిన వినీ రామన్‌తో ప్రేమలో ఉన్న అతడు.. 2020 ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే కరోనా కారణంగా మ్యాక్స్‌వెల్ పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. కాగా మ్యాక్స్‌వెల్-వినీ రామన్ జంటకు ఆస్ట్రేలియా క్రికెటర్లు, బెంగళూరు రాయల్…
ప్రపంచమంతా కరోనా కల్లోలం కొనసాగుతోంది. చాలా దేశాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో అధికారులు అతడిని ఐసోలేషన్‌కు తరలించారు. ప్రస్తుతం మ్యాక్స్‌వెల్ బిగ్‌బాష్ టోర్నీలో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే మెల్‌బోర్న్ జట్టులో 12 మంది కరోనా బారిన పడగా ఇప్పుడు మ్యాక్స్‌వెల్ 13వ వాడు కావడం గమనార్హం. ఆ జట్టులో 8 మంది సహాయక సిబ్బంది, నలుగురు ఆటగాళ్లకు…
ఐపీఎల్ సీజన్ 2021 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాణిస్తోంది. ఏబీ డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. కాగా, ఇదే మ్యాక్స్‌వెల్ గత కొన్ని సీజన్ల నుంచి పంజాబ్ తరఫున రాణించలేకపోయాడు. ప్రస్తుత ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ మ్యాక్స్‌వెల్ చెలరేగిపోయాడు. ఆర్సీబీ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున 3 మ్యాచుల్లోనే 176 పరుగులు చేశాడు. ఇదే మ్యాక్స్‌వెల్ పంజాబ్ తరఫున పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటకట్టుకోగా..…