ఐపీఎల్ 2024లో ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తీవ్రంగా నిరాశపర్చిన విషయం తెలిసిందే. 10 మ్యాచులలో 52 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలం ముందు మ్యాక్సీని బెంగళూరు వదిలేయగా.. పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. గతంలో పంజాబ్ తరఫున ఆడిన మ్యాక్స్‌వెల్‌పై ఆ ప్రాంచైజీ భారీ ఆశలు పెట్టుకుంది. ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్ 2025లో మొదటి మ్యాచ్ ఆడిన మ్యాక్స్‌వెల్.. గోల్డెన్ డక్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ సాయి కిశోర్ వేసిన 10.4 ఓవర్‌కు మ్యాక్సీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
గోల్డెన్ డకౌట్ అయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా మ్యాక్సీ నిలిచాడు. ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్ 19 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచుకు ముందు వరకు రోహిత్ శర్మ (18)తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై డకౌట్ అవ్వడంతో అగ్రస్థానంకు దూసుకెళ్లాడు. మ్యాక్స్‌వెల్, రోహిత్ తర్వాతి స్థానాల్లో దినేష్ కార్తీక్ (18), పీయూష్ చావ్లా (16), సునీల్ నరైన్ (16లు ఉన్నారు.
ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్‌ల లిస్ట్:
19 – గ్లెన్ మ్యాక్స్‌వెల్
18 – రోహిత్ శర్మ
18 – దినేష్ కార్తీక్
16 – పియూష్ చావ్లా
16 – సునీల్ నరైన్