మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం “గని” ఏప్రిల్ 8న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ బాక్సింగ్ డ్రామా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ కూడా అంగీకరించారు. ఓ లేఖ ద్వారా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని, కానీ వారిని అలరించడానికి మరింత కష్టపడతానని హామీ ఇచ్చారు. ఇక తాజా అప్డేట్ ఏమిటంటే “గని” సినిమా ఓటిటి విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది.…
మెగా ఫ్యామిలీ హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్రం శుక్రవారం జనం ముందుకు వచ్చింది. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ మూవీతో దర్శకుడిగా కిరణ్ కొర్రపాటి, హీరోయిన్ గా సాయీ మంజ్రేకర్ తెలుగువారికి పరిచయం అయ్యారు. ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, నదియా, నవీన్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ళు వరుణ్ తేజ్ కష్టపడ్డాడు.…
హీరోగానే కాదు… అవకాశం ఇస్తే విలన్ గానూ నటించడానికి సై అంటాడు నవీన్ చంద్ర. ఇప్పటికే పలు చిత్రాలలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించి నటుడిగా మంచి మార్కులు పొందాడు. ఏప్రిల్ 8న విడుదల కాబోతున్న ‘గని’ చిత్రంలో బాక్సర్ ఆది పాత్రను పోషిస్తున్నాడు నవీన్ చంద్ర. ఆది పాత్ర, దాని తీరుతెన్నుల గురించి నవీన్ చంద్ర బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ”బాక్సింగ్ అంటే మొదటి నుండి ఇష్టం. రైల్వేస్ లో పనిచేసే మా మావయ్య…
Kodthe Video Songను తాజాగా విడుదల చేశారు మేకర్స్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు వంటి నటినటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌లపై సిద్ధు ముద్దా,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీ ఈ నెల 25న జనం ముందుకు వస్తుండటంతో ఆ రోజున విడుదల కావాల్సిన మరో మూడు సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే ప్రచారపర్వాన్ని పీక్స్ కు తీసుకెళ్ళిన శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాను మార్చి 4వ తేదీకి వాయిదా వేశారు. అలానే వరుణ్ తేజ్ ‘గని’ మూవీని అదే తేదీకి పంపే ప్రయత్నం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా…
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు కానుకగా చిత్ర యూనిట్ ‘పవర్ ఆఫ్ గని’ టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో సునీల్ శెట్టి… వరుణ్‌తేజ్‌కు బాక్సింగ్‌లో కోచింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కొంతమంది యోధులుగా తయారవుతారు… కానీ గని యోధుడిగా పుట్టాడు అని ఈ టీజర్‌కు క్యాప్షన్ ఇచ్చారు. Read Also: క్యాసినో రగడ… ‘జై గుడివాడ’ అంటూ వర్మ…
మిల్కీ బ్యూటీ తమన్నా ఐటెం సాంగ్ లో కనిపించడం కొత్తేమి కాదు.. ‘కెజిఎఫ్’, ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘జై లవకుశ’ చిత్రాల్లో అమ్మడి ఐటెం సాంగ్స్ ఓ రేంజ్ లో దుమ్మురేపాయి. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి ఐటెం సాంగ్ తో పిచ్చిలేపింది. మెగాహీరో వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. అల్లు బాబీ – సిద్ధు ముద్ద నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ ఫిల్మ్ “గని” చిత్రం కొత్త విడుదల తేదీని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదల కావాల్సి ఉంది. అయితే ముందు ‘పుష్ప’, తోడుగా ‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి పోటీ గట్టిగా ఉండడంతో పక్కకు తప్పుకున్నాడు “గని”. సోలోగా రావడమే సో బెటర్ అని అలోచించి కొత్త విడుదల తేదీని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కొత్త పోస్టర్ తో…
వరుణ్ తేజ్ తొలిసారి బాక్సర్‌గా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా “గని”. వరుణ్ అభిమానులతో పాటు స్పోర్ట్స్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ‘గని’. మేకర్స్ ఈ రోజు ‘గని’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, ఉపేంద్ర, తనికెళ్ల భరణి, నరేష్, నదియా, ఇతరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారికి సంబంధించిన పాత్రలను రివీల్ చేశారు. అంతేకాదు ఈ చిన్న వీడియోలో ఈ నెల 15న…
డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లను బాక్సింగ్ రింగ్ గా మార్చేసి తన ప్రతాపం చూపించబోతున్నాడు వరుణ్ తేజ్! అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్న ‘గని’ మూవీ అదే రోజున జనం ముందుకు రాబోతోంది. ఇదే సమయంలో మరో పక్క ‘ఎఫ్ 3’తో నవ్వుల పువ్వులూ పూయించబోతున్నాడు ఈ మెగా ఫ్యామిలీ యంగ్ హీరో. ఇలా వైవిధ్యమైన రెండు చిత్రాలలో నటిస్తున్న వరుణ్ తేజ్… తొలిసారి బాక్సింగ్ జర్సీని ధరించడం విశేషమనే…