మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం “గని” ఏప్రిల్ 8న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ బాక్సింగ్ డ్రామా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ కూడా అంగీకరించారు. ఓ లేఖ ద్వారా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని, కానీ వారిని అలరించడానికి మరింత కష్టపడతానని హామీ ఇచ్చారు. ఇక తాజా అప్డేట్ ఏమిటంటే “గని” సినిమా ఓటిటి విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. “గని” చిత్రం ఏప్రిల్ 22న డిజిటల్ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతోంది.
Read Also : Sanjay Dutt : డ్రగ్స్ అలవాటుకు కారణం అమ్మాయిలేనట !!
ఇదే విషయాన్ని తాజాగా తెలుగు ఓటిటి సంస్థ ఆహా వెల్లడించింది. కనీవినీ ఎరుగని స్టైల్ లో “గని” వస్తున్నాడు అంటూ ఒక చిన్న ఆసక్తికర టీజర్ ను పోస్ట్ చేశారు. థియేటర్‌లలో “గని” సినిమాను మిస్ అయిన వారు ఈ శుక్రవారం ఆహాలో కుటుంబంతో చూసి ఆనందించవచ్చు. అల్లు బాబీ, సిద్ధు ముద్దా నిర్మించిన “గని” చిత్రంలో సాయి మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా, నవీన్ చంద్ర, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. మరి థియేటర్లలో ప్లాప్ టాక్ ను అందుకున్న “గని”కి ఓటిటిలో ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి.
Kanivini yerugani style lo vastunnadu #GhaniOnAHA. Gear up to witness the Mega Prince @IAmVarunTej in this action family drama on 22nd April.
@IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @abburiravi @sidhu_mudda @Bobbyallu pic.twitter.com/Y7Lz5DZk4K
— ahavideoin (@ahavideoIN) April 17, 2022