Kodthe Video Songను తాజాగా విడుదల చేశారు మేకర్స్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు వంటి నటినటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘గని’ తెరకెక్కుతోంది. సంగీతం తమన్ అందించారు. తాజాగా ఈ చిత్రం నుంచి “కొడ్తే” అనే స్పెషల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.
Read Also : Macherla Niyojakavargam : సాలిడ్ అప్డేట్ ఇచ్చిన నితిన్
ఇప్పటికే విడుదలైన “కొడ్తే” లిరికల్ సాంగ్ కు మంచి స్పందన రాగా, ఇప్పుడు విడుదలైన వీడియో సాంగ్ లో తమన్నా సిజ్లింగ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించి ఇప్పటికే హైప్‌ని సృష్టించాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో వరుణ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. కాగా ఏప్రిల్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.