Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో బందీలుగా ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని హమాస్‌కు గట్టి హెచ్చరిక చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు గాజాలో ఉన్న బందీలను విడుదల చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రపంచమంతా ఆ దృశ్యాలను చూసే అవకాశం ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా, యుద్ధ విరమణ ఒప్పందాన్ని రద్దు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. “అక్కడ మిగిలి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గాజాపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ఇటీవల చేసిన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.
Donald Trump: ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు సంచలన ప్రకటన విడుదల చేశారు. యుద్ధంతో దెబ్బతిన్న పాలస్తీనాలో భూభాగమైన గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవాలని భావిస్తుంది పేర్కొన్నాడు.
హమాస్ అంతమే లక్ష్యంగా జరిగిన యుద్ధంలో ఐడీఎఫ్ ఎన్నో ఘన విజయాలను సాధించింది. కీలక అగ్ర నేతలందరినీ మట్టు్బెట్టించింది. హమాస్ అగ్ర నేత హనియే, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా లాంటి ఖ్యాతి గడించిన నాయకులందరినీ ఇజ్రాయెల్ అంతం చేసింది.
Israel - Hamas: కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్- హమాస్‌లు తమ అధీనంలో ఉన్న బందీలను దశల వారిగా విడుదల చేస్తున్నారు. తమ చెరలోని బందీలుగా ముగ్గురిని హమాస్ రిలీజ్ చేయగా.. ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచి పెట్టింది.
Israel Cabinet: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు బందీల విడుదలకు ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ ఒప్పందానికి మార్గం సుగమం చేయాలని కేబినెట్‌కు ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహు కార్యాలయం పేర్కొంది.
Gaza Ceasefire-Hostage Deal: ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య సయోధ్య కుదిరింది. అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో బందీలను రిలీజ్ చేసేందుకు ఇరు వర్గాల మధ్య ఒప్పందం చివరి దశకు చేరిందని ఇజ్రాయెల్ ప్రధాని మంత్రి కార్యాలయం వెల్లడించింది.
Gaza Ceasefire: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారతదేశం స్వాగతించింది. ఒప్పందం తర్వాత గాజాలో శాంతి, మానవతా సహాయం పెరుగుతాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. గాజాలో బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటనను స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది గాజా ప్రజలకు సురక్షితమైన, నిరంతర మానవతా సహాయం అందించడానికి దారి తీస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. అన్ని రకాల బందీల విడుదల, కాల్పుల విరమణ,…
డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. తాను అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టకముందే హమాస్ చెరలో ఉన్న బందీలను రిలీజ్ చేయాలి.. అలా జరగకపోతే మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు నరకం చూపిస్తానని అతడు హెచ్చరించారు.
హమాస్ అంతమే లక్ష్యంగా నూతన సంవత్సరం వేళ కూడా ఇజ్రాయెల్ వేట సాగిస్తోంది. న్యూఇయర్ వేళ జరిపిన దాడుల్లో పదుల కొద్దీ చనిపోగా.. ఇక తాజాగా జరిగిన దాడుల్లో హమాస్ అగ్ర అధికారులతో సహా 10 మంది చనిపోయారు.