Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో బందీలుగా ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని హమాస్‌కు గట్టి హెచ్చరిక చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు గాజాలో ఉన్న బందీలను విడుదల చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రపంచమంతా ఆ దృశ్యాలను చూసే అవకాశం ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా, యుద్ధ విరమణ ఒప్పందాన్ని రద్దు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. “అక్కడ మిగిలి ఉన్న బందీలను విడుదల చేయాలి. వారందరినీ సురక్షితంగా వెనక్కి పంపాలి” అని ట్రంప్ స్పష్టం చేశారు. బందీలను విడుదల చేయకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Also Read: Fire Accident: పాతబస్తీలో 400 బట్టల దుకాణాలు దగ్ధం.. 24 గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది!
గాజాలో యుద్ధ విరమణ ఒప్పందం కింద గత మూడువారాలుగా ప్రతి శనివారం బందీలను విడిచిపెడుతున్నారు. ఈ శనివారానికి కూడా అందరూ అదే ఆశించారు. బందీల కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే, ఈ సారి పరిస్థితులు అనుకున్నట్లుగా జరిగలేదు. దీనిపై కుటుంబసభ్యులు నిరసన చేపట్టి తెల్ అవీవ్‌ను ముట్టడించారు.
ఈ నేపథ్యంలో బందీలను విడుదల చేయకపోతే హమాస్ దీనికి తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు అన్ని బందీలను తిరిగి ఇవ్వకపోతే, ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను అని ఆయన అన్నారు. అలాగే గాజా శరణార్థులను తీసుకోవడానికి జోర్డాన్, ఈజిప్ట్ నిరాకరిస్తే వారికి అందిస్తున్న సహాయాన్ని నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంతేకాకుండా గాజా నుంచి పాలస్తీనియన్లు తిరిగి వచ్చే హక్కు ఉండదని కూడా స్పష్టం చేశారు.
Also Read: PM Modi: ఫ్రాన్స్‌లో మోడీ పర్యటన.. మాక్రాన్ ఇచ్చిన విందుకు హాజరైన ప్రధాని
గాజాలో 15 నెలల యుద్ధం అనంతరం హమాస్, ఇజ్రాయెల్ మధ్య జనవరి 19 నుంచి యుద్ధ విరమణ అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం కింద 21 మంది బందీలను విడుదల చేశారు. ఇందులో 16 మంది ఇజ్రాయెలీ పౌరులు, ఐదుగురు థాయ్ పౌరులు ఉన్నారు. మరోవైపు సదరు బందీలకు బదులుగా వందలాది మంది పాలస్తీనా బందీలను విడుదల చేశారు. ఇప్పటికీ 70 మందికిపైగా బందీలు గాజాలో ఉన్నారు. బంధీల విడుదల జరుగుతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ట్రంప్ హెచ్చరికతో గాజా పరిస్థితి మరింత దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి.