గాజాలో పరిస్థితులు అత్యంత ఘోరంగా తయారయ్యాయి. గతేడాది ప్రారంభమైన యుద్ధంతో గాజా పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆహార కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గాజా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆపేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రపంచమంతా ఎదురుచూస్తోందని ఇరాన్ పేర్కొంది.
Israel Attack : ఇజ్రాయెల్ దాడిలో గాజా, లెబనాన్‌లలో మొత్తం 23 మంది మరణించారు. ఇందులో శనివారం గాజాలోని మూడు వేర్వేరు ప్రదేశాలలో ఇజ్రాయెల్ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా దాదాపు 16 మంది మరణించారు.
గాజాపై ఇజ్రాయెల్ జరిపిస్తున్న మారణహోమానికి ప్రతీకారంగానే అమ్‌స్టర్‌డామ్‌లో ఇజ్రాయెల్ పౌరులపై దాడి జరిగిందని హమాస్ మిలిటెంట్ గ్రూప్ నేత సమీ అబు జుహ్రీ పేర్కొన్నాడు.
గాజాలో కరవు విలయతాండవం చేస్తోంది. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. భవంతులు కుప్పకూలాయి. ఆహార ఉత్పత్తులు అడుగంటాయి. స్వచ్ఛంద సంస్థల సహాయాలు నిలిచిపోయాయి. దీంతో కరవు మరింత దుర్భిక్షంగా మారింది.
Israeli Airstrikes Beirut: లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్. లెబనాన్‌లోని ఏకైక అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు సమీపంలోనూ దాడులకు పాల్పడింది.
Gaza-Israel War: హమాస్, హెజ్బొల్లా గ్రూప్లను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వాన్ని.. గాజా కీలక దస్త్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తోంది. ప్రధాని సన్నిహితులే ఈ రహస్య సమాచారం లీక్ చేశారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దేశ భద్రతాపరమైన అత్యంత రహస్య సమాచారాన్ని పీఎంఓలో పనిచేస్తోన్న అధికారిక ప్రతినిధి ఎలిఫెల్డ్స్టెయిన్ చేరవేశారని పేర్కొన్నాయి. భద్రతా సంస్థల్లో పనిచేస్తోన్న మరో ముగ్గురికి కూడా దీనితో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. అయితే వారి పేర్లు మాత్రం…