Israel Cabinet: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు బందీల విడుదలకు ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ ఒప్పందానికి లైన్ క్లియర్ చేయాలని కేబినెట్‌కు ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహు కార్యాలయం చెప్పుకొచ్చింది. అన్ని రాజకీయ, భద్రతాపరమైన, మానవతా అంశాలను పరిశీలించిన తర్వాత.. యుద్ధం లక్ష్యాలను సాధించడానికి ఇది ప్రయోజనకరమా కాదా అనేది అర్థం అయిన తర్వాతే ఒప్పందాన్ని ఆమోదించినట్లు ఇజ్రాయెల్ కేబినెట్ వెల్లడించింది.
Read Also: RG Kar Medical Hospital: నేడు ఆర్జీ కర్ హస్పటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసులో తీర్పు
అయితే, బందీల విడుదలపై ఇప్పటికే వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తెలిపింది. తాజా పురోగతి నేపథ్యంలో రేపటి (జనవరి 19) నుంచి ఒప్పందం అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పంద ప్రక్రియ జరిగింది. ఇజ్రాయెల్ బందీల రిలీజ్ కు ప్రతిగా పాలస్తీనా ఖైదీలను జెరూసలేం విడిచిపెట్టనుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.