Israel-Hamas ceasefire: ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం!
- ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య కుదిరిన సయోధ్య..
- బందీలను విడుదల చేసేందుకు ఇరు వర్గాల ఒప్పందం..
- బందీల కుటుంబాలకు సమాచారం ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas ceasefire: ఇజ్రాయెల్- అమెరికా, ఖతార్‌ల మధ్యవర్తిత్వంతో హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో బందీలను విడుదల చేసేందుకు ఇరు వర్గాల మధ్య ఒప్పందాలు చివరి దశకు వచ్చాయని ఇజ్రాయెల్ ప్రధాని మంత్రి కార్యాలయం తెలిపినట్లు.. అక్కడి మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి అడ్డుగా మారిన చిక్కులను క్రమంగా తొలగించుకుంటున్ననట్లు పేర్కొన్నారు. అలాగే, ఇజ్రాయెల్ కేబినెట్ సమావేశం తర్వాత ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు బెంజమిన్ నెతాన్యహు క్యాబినెట్ భేటీ కానుంది. మంత్రివర్గం ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తే.. వచ్చే ఆదివారం నాటి నుంచి ఇది అమలుల్లోకి వస్తుంది. కాగా, ఇరు దేశాల మధ్య బందీల విడుదల ప్రక్రియ ప్రారంభం అవుతంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించేందుకు నిబంధనలను సైతం ఖరారు చేయనున్నట్లు టాక్. ఇక, ఈ ఒప్పందం గురించి ఇప్పటికే బందీల కుటుంబాలకు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం సమాచారం అందజేసింది.
Read Also: Hyderabad: అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటన.. నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలు గాలింపు!
Also Read
అయితే, 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ భారీగా దాడికి దిగింది. ఈ ఘటనలో సుమారు 1200 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు మరణించగా.. మరో 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకుపోయారు. దీంతో హమాస్‌పై ఇజ్రాయెల్ భీకరమైన దాడులకు దిగింది. హమాస్ అగ్రనేత ఇస్మాయెల్ హనియా, యహ్యా సిన్వార్‌తో పాటు కీలక నేతలను చంపేసింది. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో దాదాపు 46 వేల మందికి పైగానే పాలస్తీన ప్రజలు చనిపోయారు.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!