Hamas-Israel: చనిపోయాడనుకున్న హమాస్ కమాండర్ ప్రత్యక్షం.. షాకైన ఐడీఎఫ్!
- చనిపోయాడనుకున్న హమాస్ కమాండర్ ప్రత్యక్షం
- షాకైన ఇజ్రాయెల్! ఐడీఎఫ్ సామర్థ్యంపై సందేహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్ అంతమే లక్ష్యంగా జరిగిన యుద్ధంలో ఐడీఎఫ్ ఎన్నో ఘన విజయాలను సాధించింది. కీలక అగ్ర నేతలందరినీ మట్టుబెట్టింది. హమాస్ అగ్ర నేత హనియే, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా లాంటి ఖ్యాతి గడించిన నాయకులందరినీ ఇజ్రాయెల్ అంతం చేసింది. కానీ తాజాగా ఐడీఎఫ్‌కు భారీ షాక్ తగిలింంది. గత మే నెలలో చనిపోయాడనుకున్న హమాస్ సీనియర్ నాయకుడు హుస్సేన్ ఫయాద్ తాజాగా గాజాలో ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ షాక్‌కు గురైంది. అంతేకాకుండా ఐడీఎఫ్ సామర్థ్యంపై సందేహాలు లేవనెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: Maharastra : ఆర్మీ ఆయుధ కర్మాగారంలో పేలుడు.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య..ఘటనకు కారణం ఏంటంటే ?
Also Read
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
అక్టోబర్ 7, 2023న హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. హమాస్ నాయకులను మట్టుబెట్టింది. ఈ పరిణామంలో గత మే నెలలో హమాస్ సీనియర్ కమాండర్ హుస్సేన్ ఫియాద్ చనిపోయినట్లుగా ఐడీఎఫ్ అధికారికంగా ప్రకటించింది. కానీ తాజాగా అతడు.. ఇజ్రాయెల్‌కు షాకిచ్చాడు. అతడు ఇంకా బతికే ఉన్నాడు. ఇటీవల విడుదల చేసిన వీడియోలో ఫియాద్ కనిపించాడు. దీంతో అతడు చనిపోలేదు. ఐడీఎఫ్‌కే షాకిచ్చాడు. ఫియాద్ విషయంలో అంచనాలు తారుమారు అయినట్లుగా తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ అయిన వీడియో తేదీ లేదు గానీ.. తాజా వీడియోనే అని మాత్రం అర్థమవుతోంది.
ఇది కూడా చదవండి: Tirumala: రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతున్న తిరుమల..
చనిపోయాడనుకున్న హుస్సేన్ ఫయాద్ సజీవంగా ప్రత్యక్షం కావడంతో హమాస్‌కు ఊపిరిపోసినట్లైంది. అతడి ఆధ్వర్యంలో కొత్త జీవం పోసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫయాద్ సజీవంగా ఉండడంతో హమాస్ పూర్తిగా అంతం కాలేదని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం జరగడంతో బాంబు దాడులు తగ్గాయి. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
ఏడాదికి పైగా జరిగిన యుద్ధంలో వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. గాజాను పూర్తిగా ఐడీఎఫ్ ధ్వంసం చేసింది. అయితే ఇటీవల ఖతర్, అమెరికా జోక్యంతో రెండు దేశాల మధ్య ఒప్పందం జరగడంతో కాల్పులు ఆగాయి. అలాగే కొంత మంది బందీలను హమాస్ విడిచిపెట్టింది. అలాగే ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనీయులను కూడా విడిచిపెట్టింది.
A video uploaded to Instagram shows Hussein Fiad, the commander of Hamas' Beit Hanoun battalion, recently speaking to a group of people. The IDF said last May it eliminated Fiad. While the video is undated, it appears to be authentic. pic.twitter.com/E3aNjhZ6ih
— Joe Truzman (@JoeTruzman) January 22, 2025
తాజావార్తలు
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!