Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇన్నాళ్లు ఉత్తర గాజాను మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ సైన్యం, ఇప్పుడు దక్షిణ గాజాపై కూడా ఫోకస్ పెట్టింది. శనివారం దక్షిణ గాజాపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 36 మంది మరణించారు. అంతకుముందు ప్రజల రక్షణ కోసం ఉత్తర గాజాను ఖాళీ చేసి దక్షిణ గాజాకు వెళ్లాలని చెప్పిన ఇజ్రాయిల్, ఇప్పుడు అక్కడ హమాస్ టెర్రరిస్టులను టార్గెట్ చేస్తోంది.
Israel-Hamas War: ఇన్నాళ్లు ఉత్తర గాజా ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ ఆర్మీ, ఇప్పుడు హమాస్‌ని పూర్తిగా నిర్మూలించడానికి దక్షిణ గాజాపై కూడా ఫోకస్ చేసింది. దక్షిణ గాజా లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దళం దాడులు చేసింది. శనివారం జరిగిన ఈ దాడుల్లో 32 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గతంలో ఉత్తరగాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ గాజా ప్రజలను హెచ్చరించింది.
Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. ఈ దాడిలో 1400 మందిని హతమర్చాడమే కాకుండా, ఇజ్రాయిల్ లోని 240 మందిని కిడ్నాప్ చేసి గాజాలోకి బందీలుగా పట్టుకెళ్లింది. అయితే ఇందులో ఇప్పటికే కొంతమందిని చంపేసినట్లు తెలుస్తోంది. తాజాగా 19 ఏళ్ల ఇజ్రాయిల్ మహిళా సైనికురాలు హత్యకు గురైనట్లు డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో గాజాలోని పెద్ద పెద్ద భవనాలు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. దీంతో ఈ యుద్ధంలో మరణించిన వారి గురించి వారి బంధవులు ఇప్పుడు శిథిలాల కింద గాలిస్తున్నారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మరింత తీవ్రం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజా స్ట్రిప్‌పై భూతల దాడి చేస్తున్న ఇజ్రాయిల్ బలగాలు హమాస్ వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు గాజాను అదుపులోకి తీసుకునేందుకు ఆపరేషన్స్ చేపడుతోంది. ముఖ్యంగా గాజాలోని ఉత్తర ప్రాంతంపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే హమాస్ పార్లమెంట్‌తో పాటు హమాస్ నియంత్రణలో ఉన్న ఓడరేవును ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకుంది.
Shehla Rashid: ఒకప్పుడు ప్రధాని నరేంద్రమోడీని విపరీతంగా వ్యతిరేకించే జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) మాజీ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ ప్రస్తుతం పొగడ్తల వర్షం కురిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితికి ప్రధాని మోడీకి, హోమంత్రి అమిత్ షాలకు థాంక్స్ చెప్పారు. గతంలో తాను కాశ్మీర్ లో రాళ్లు విసిరే వారిపై సానుభూతితో వ్యవహరించానని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని షెహ్లా రషీద్ అన్నారు.
Israel-Hamas War: గాజాలో హమాస్ ఉగ్రసంస్థను తుడిచిపెట్టేలా ఇజ్రాయిల్ దాడులు నిర్వహిస్తోంది. భూతలదాడుల్లో హమాస్ ఉగ్రవాదలను హతమారుస్తోంది. హమాస్ ఉగ్రసంస్థకు కేంద్రాలుగా ఆస్పత్రులను ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. ఈ ఆస్పత్రి కిందనే హమాస్ కమాండ్ సెంటర్ తో పాటు కీలక ఉగ్రవాదులు ఉన్నట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది.
Israel-Hamas War: గాజాపై ఇజ్రాయిల్ సైన్యం పట్టు సాధిస్తోంది. హమాస్ వ్యవస్థను నేలమట్టం చేసేందుకు ఉత్తర గాజాను ముఖ్యగా గాజా నగరాన్ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చుట్టుముట్టింది. గాజాలో భూతల దాడుల ద్వారా హమాస్ ఉగ్రస్థావరాలను నేలకూల్చుతోంది. ముఖ్యంగా హమాస్ ఉగ్రవాదులకు, వారి టన్నెట్ వ్యవస్థకు రక్షణగా ఉన్న ఇజ్రాయిల్ లోని పలు ఆస్పత్రులను ఐడీఎఫ్ చుట్టుముట్టింది. ముఖ్యంగా అల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్ టార్గెట్ చేస్తోంది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై దాడి చేశారు. ఈ దాడిలో 1400 మంది ఊచకోత కోశారు, మరో 200 మంది వరకు ప్రజల్ని బందీలుగా చేసుకుని గాజా ప్రాంతంలోకి తరలించారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాస్ట్రిప్ పై తీవ్రంగా దాడులు చేస్తోంది. హమాస్‌ని నేలకూల్చే వరకు విశ్రమించేంది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. హమాస్ ఉగ్రస్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది.…