ఇజ్రాయెల్- హమాస్ మధ్య వచ్చే సోమవారానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఆ దిశగా కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయన్నారు.
Israeli Attack : రఫాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 44 మంది పాలస్తీనియన్లు మరణించారు. కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ... భూమి దాడికి ముందు దక్షిణ గాజా నగరం నుండి వేలాది మంది ప్రజలను తరలించడానికి ఒక ప్రణాళికను రూపొందించాలని సైన్యాన్ని కోరినట్లు చెప్పారు.
Israel Air Strike : గాజా స్ట్రిప్‌లోని రఫాలో రాత్రిపూట ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 13 మంది మరణించారు. హమాస్ కాల్పుల విరమణ నిబంధనలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి.
శాశ్వత కాల్పుల విరమణ కోసం హమాస్ కొత్త ప్రతిపాదనలను పరిశీలిస్తున్న సమయంలో గాజాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దక్షిణ గాజా నగరం ఖాన్ యూనిస్‌లో అత్యంత భీకర పోరు కొనసాగుతోంది.
అక్టోబరు 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-గాజా యుద్ధం ఆగిపోయే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఈ రక్తపాత సంఘర్షణలో మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో సుమారు 16 వేల మంది ఈ యుద్ధంలో మరణించారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య అక్టోబర్ నుంచి యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ఇప్పటివరకు గాజాలోని హమాస్‌కు భారీ నష్టం కలిగించింది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడిలో దాదాపు 100 మంది పాలస్తీనియన్లు మరణించగా.. 158 మంది గాయపడ్డారు.
ఇజ్రాయెల్ ఆర్మీ తాజాగా మరోసారి గాజాపై కవ్వింపులకు పాల్పడింది. గాజా నుంచి తిరిగి వస్తున్న సహాయ కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థ ఈ ఘటనను వెల్లడించింది. అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని స్పష్టం చేసింది. కాగా గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ బాంబు దాడుల్లో ఇప్పటికే 20,000 మందికి పైగా పాలస్తీనా ప్రజలు మరణించగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. అయితే గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ…
నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా వివాదాలకు ముగింపు పలకకపోతే, గాజా, పాలస్తీనాకు ఎదురైన గతినే కాశ్మీర్ ఎదుర్కొంటుందని అన్నారు.
Gaza : గాజాలో భీకర యుద్ధం కొనసాగుతుంది. దీంతో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. సోమవారం రఫా సరిహద్దును దాటి గాజాలోకి ప్రవేశించిన సహాయక ట్రక్కులపై ఎగబడ్డ జనం అందినకాడికి సామగ్రిని ఎత్తుకుపోయారు.
Artificial intelligence (AI): ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. వైమానికి, భూతల దాడుల్ని నిర్వహిస్తోంది. అయితే ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడుతోందనే నివేదికలు వెలువడ్డాయి. గాజాలోని హమాస్ లక్ష్యాలను టార్గెట్ చేయడంతో పాటు పౌరమరణాల సంఖ్యను ముందుగానే అంచనా వేయగానికి ఈ వ్యవస్థని ఉపయోగిస్తోంది.