ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నిరంతరం గాజాపై బాంబు దాడులు చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగా.. వెస్ట్ బ్యాంక్ నగరంలోని అరూరాలోని సీనియర్ హమాస్ అగ్రనాయకుడు సలేహ్ అల్-అరౌరీ ఇంటిని కూల్చివేసింది. . ఈ నాయకుడి పేరు సలేహ్ అల్-అరూరి. అతను హమాస్ పొలిటికల్ బ్యూరో డిప్యూటీ చీఫ్, వెస్ట్ బ్యాంక్‌లో హమాస్ మిలిటరీ కమాండ్ నాయకుడు.
Israel Hamas War: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం చాలా మంది విదేశీ పౌరులకు తీవ్ర విషాదాన్ని నింపింది. అక్టోబర్ 7న హమాస్ చేసిన ఆకస్మిక దాడి తరువాత చాలా మంది యోధులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు.
Israel-Hamas War: అక్టోబర్ 7 హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై క్రూరమైన దాడిని చేశారు. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించారు. 200 మందికి పైగా సాధారణ ప్రజలను బందీలుగా పట్టుకుని గాజాకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇజ్రాయిల్, గాజాపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 6500 మంది మరణించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు వైమానిక దాడులకు పరిమితమైన ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమవుతున్నాయి. గాజా…
Israel Hamas War: గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేయడం వల్ల పౌరుల మరణాల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అల్ జజీరా రిపోర్టర్ వేల్ అల్-దహదౌహ్ కుటుంబం మొత్తం చనిపోయారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్దంతో గాజాలో తీవ్ర నష్టం జరిగింది. దీంతో గాజా స్ట్రిప్ లో ఆరోగ్య సామాగ్రి, ఇంధనం యొక్క సురక్షితమైన రవాణాను సులభతరం చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తక్షణ మానవతా కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది
Egypt’s aid for Gaza: హమాస్ ఇజ్రాయిల్ పైన అతి క్రూరంగా దాడి చేసింది. ప్రజలు చంపొద్దని వేడుకున్న కనికరించలేదు. చిన్న, పెద్ద అని తేడా చూడలేదు, మహిళలు పురుషులనే తారతమ్యం లేకుండా విచక్షణ రహితంగా 1400 మందికి పైగా చంపేశారు. దీనితో ఇజ్రాయిల్ హమాస్ ను శిధిలం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. అన్నట్టుగానే హమాస్ పాలనలో ఉన్న గాజా పైన బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయిల్ దాడుల్లో 4500 మందికి పైగా మరణించారు. వందలమంది గాయపడ్డారు.…
Israeli–Palestinian conflict: ఇజ్రాయిల్ గాజా పైన చేస్తున్న ప్రతీకార దాడులు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే ఇజ్రాయిల్ గాజా పైన కురిపిస్తున్న బాంబుల వర్షానికి గాజా అతలాకుతలం అయింది. దయనీయ స్థితిలో గాజా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. ఇజ్రాయిల్ ధాటికి హమాస్ దిగివచ్చింది. గాజా పైన చేస్తున్న బాంబుల దాడిని నిలిపివేస్తే హమాస్ అధీనంలో ఉన్న ఇజ్రాయిల్ బందీలందరిని విడుదల చేస్తాం అని తెలిపింది. కాగా గాజా భూభాగంలో సంభవించిన విపత్తు నేపథ్యంలో మానవతా…
Israel Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య సహాయానికి సంబంధించిన మొదటి సరుకు గాజాకు చేరుకుంది. ఈజిప్టు సరిహద్దులో ఉన్న రఫా క్రాసింగ్‌ను శనివారం ప్రారంభించారు. గాజాలోకి 20 ట్రక్కులను అనుమతించారు.
2023 Israel–Hamas war: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కారుచిచ్చు రగులుతుంది. ఇప్పటికే ఇరు దేశాలు విచక్షణ రహితంగా ఒకరి మీద ఒక్కరు విరుచుకు పడుతున్నారు. ఈ మారణహోమంలో వేలమంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. అయితే ఇలాంటి సమయంలో ఇతర దేశాలు మద్దతు ఇస్తూ యుద్ధంలో పాల్గొనడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రఖ్యాత రాజకీయ శాస్త్రవేత్త. వివరాలలోకి వెళ్తే.. ఓ అంతర్జాతీయ మీడియాతో ప్రఖ్యాత రాజకీయ శాస్త్రవేత్త మరియు యురేషియా గ్రూప్…
Israel-Hamas War: ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ మధ్య యుద్ధం తీవ్రంగా సాగుతోంది. మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై జరిపిన దాడిలో 1400 మంది ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. దీని తర్వాత నుంచి ఇజ్రాయిల్ వరసగా గాజా స్ట్రిప్ పై వైమానిక దాడులు చేస్తోంది. గాజా ప్రాంతాన్ని దిగ్భంధించి హమాస్ ఉగ్రవాద స్థావరాలపై నేలమట్టం చేస్తోంది.