ఇజ్రాయెల్- హమాస్ మధ్య గత కొంత కాలంగా యుద్ధం కొనసాగుతుంది. అయితే, అక్టోబర్ 24న ఈ రెండు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో వారం రోజుల పాటు ఎలాంటి దాడులు జరగలేదు.
Israel-Palestine: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్ దారుణానికి ఒడిగట్టింది. ఇజ్రాయిల్ సైనికులకు సహకరించారనే నెపంతో ముగ్గురు పాలస్తీనా పౌరుల్ని బహిరంగంగా ఉరి తీశారు. ఇజ్రాయిల్‌కి సహకరించినందుకు వెస్ట్‌బ్యాంక్ ప్రాంతంలో ఈ హత్యలు జరిగాయి. తుల్కర్మ్‌లో రెండు మృతదేహాలను విద్యుత్ స్తంభానికి వేలాడదీశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇటీవల గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్-షిఫా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నానుతోంది. ఈ ఆస్పత్రి కిందనే భారీ సొరంగాలు ఉన్నాయని, టెర్రరిస్టుల టన్నెల్ నెట్వర్క్ ఉందని ఇజ్రాయిల్ ఆర్మీ ఆరోపిస్తోంది. తాజాగా ఈ ఆస్పత్రి కిందనే అతిపెద్ద ఉగ్రవాద సొరంగాన్ని ఇజ్రాయిల్ ఆర్మీ కనుగొంది. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది.
Israel-Hamas War: ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై 49 రోజులు అవుతోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ నిరంతరం గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులను నిర్వహిస్తోంది.
Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో గాజా ప్రాంతంలోని అల్-షిఫా ఆస్పత్రి హాట్‌స్పాట్‌గా మారింది. ఈ ఆస్పత్రినే హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్‌గా, ఆయుధాలు దాచేందుకు స్థావరంగా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయిల్ ఆర్మీ ఆధారాలతో బయటపెట్టింది. ఆస్పత్రి కింద టన్నెల్స్, ఇతర ఏర్పాట్లను గుర్తించింది. ఇదే కాకుండా గాజాలోని పలు ఆస్పత్రుల కింద ఇలాంటి నిర్మాణాలే ఉన్నాయని ఇజ్రాయిల్ పేర్కొంది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయిల్ ఆర్మీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర గాజాపై హమాస్ ఉగ్రవాదులు నియంత్రణ కోల్పోయారని గాజా ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది. ఇజ్రాయిల్-హమాస్ సంధి నేపథ్యంలో నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. అయితే ఈ ఒప్పందంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ దళాలు తాజా హెచ్చరికలు చేశాయి.
PM Modi: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ... ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాది ప్రధాని నరేంద్రమోడీ మరోసారి నొక్కి చెప్పారు. బుధవారం జీ 20 సమ్మిట్ వర్చువల్ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు జీ 20 సభ్య దేశాలతో కలిసి నడవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఇజ్రాయిల్- హమాస్ మధ్య బందీల విడుదల ఒప్పందాన్ని ప్రధాని మోడీ స్వాగతించారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్ గాజాలోని హమాస్ ఉగ్రవాదులపై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులతో పాటు భూతల దాడులను కూడా తీవ్రతరం చేసింది. ఇన్నాళ్లు ఉత్తర గాజాలో పాటు, గాజా నగరంపై దృష్టి పెట్టిన ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఇప్పుడు సురక్షితం అనుకున్న దక్షిణ గాజాలోని పట్టణాలపై కూడా దాడులు చేస్తోంది. హమాస్ ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం ఉన్న ప్రతీ చోట బాంబుల వర్షం కురిపిస్తోంది.