'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి బుధవారం నాడు సాయంత్రం పర్యటించారు. ముందుగా హనుమాన్ జంక్షన్ కు విచ్చేసిన భువనేశ్వరికి యార్లగడ్డ వెంకట్రావ్ దంపతులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధ్వర్యంలో సోమవారం నాడు సాయంత్రం గన్నవరంలోని రోటరీ క్లబ్ హాల్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గన్నవరం నియోజకవర్గ నలువైపుల నుంచి మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని వైసీపీ కబంద హస్తాల నుంచి కాపాడాలంటే అది టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు . విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని గురువారం యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు.
Yarlagadda Venkat Rao Election Campaign: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుపై ఓటేసి.. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన నియోజకవర్గ ప్రజలను కోరారు. బాబు వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని యార్లగడ్డ ప్రచారం చేశారు. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గన్నవరం మండలం ముస్తాబాద గ్రామంలో యార్లగడ్డ…
విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. నున్న గ్రామంలో నూతనంగా టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలో అధికార ప్రభుత్వ నాయకులు తెలుగు భాషను కు.ని చేసి బూతులు మాట్లాడం బాధాకరం అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఉద్యోగ కల్పనా కల్పించక పోగా యువతను తప్పు దారిలో నడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని…
స్త్రీ శక్తి స్వరూపిణి అని, మహిళలు కన్నెర్ర జేస్తే వైసీపీ గల్లంతవుతుందన్నారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరి. గన్నవరంలోని ఏబీ కల్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి తెలుగు మహిళా సమావేశంలో వెంకట్రావుతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు.
కృష్ణా జిల్లా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలోని రెండు ఆలయాలకు గన్నవరం నియోజవర్గ టీడీపీ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు మూడు లక్షల రూపాయల నగదు విరాళంగా అందజేశారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీలోకి చేరికల హోరు కొనసాగుతుంది. తాజాగా.. కొందరు వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. గన్నవరం నియోజకవర్గ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ విధానాలు నచ్చి అనేక మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు.. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం కార్యకర్తలతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ.. టీడీపీ ప్రకటించిన ఆరు హామీలపై ప్రచారం చేశారు. చంద్రబాబు హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించడంతో పాటు 2024లో అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. అంతేకాకుండా.. స్థానిక సమస్యలపై యార్లగడ్డ ఆరా తీశారు.…
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్పై నాలుగు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు.. వంశీపై నాలుగు కేసుల్లో విచారణ చేస్తున్న ప్రజా ప్రతినిధుల కోర్టు.. ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది న్యాయస్థానం..