‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి బుధవారం నాడు సాయంత్రం పర్యటించారు. ముందుగా హనుమాన్ జంక్షన్ కు విచ్చేసిన భువనేశ్వరికి యార్లగడ్డ వెంకట్రావ్ దంపతులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆలయంలో భువనమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గం నలువైపుల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ- జనసేన- బీజేపీ పార్టీలకు చెందిన తెలుగు మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని నారా భువనేశ్వరికి తమ మద్దత్తు తెలియజేశారు.
Read Also: Sundaram Master OTT : ఓటీటీలోకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అనంతరం బాపులపాడు మండలం బిళ్ళనపల్లి గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరి గ్రామస్తులు యెదురువాడ కిరణ్, యెదురువాడ బసవరావు కుటుంబ సభ్యులను కలిసి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకొని పరామర్శించారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో టీడీపీ వీర అభిమానులైన వీరు ఇరువురు తీవ్ర మనస్తాపానికి గురై మృతి చెందారు. ఈ సందర్బంగా నారా భువనేశ్వరి ఇరువురి కుటుంబాలను కలిసి వారిని ఓదార్చి అండగా ఉంటామన్న భరోసాను కల్పించారు. ఈ సందర్బంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైలుపాలు చేశారు.. ఆ సమయంలో 203 మంది తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు.. తెలుగుదేశం పార్టీ నిలబడాలని నారా చంద్రబాబు అభిమానులు, రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారని ఆమె తెలిపారు. ఆ సమయంలోనే ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు బిళ్ళనపల్లి గ్రామానికి చేరుకోవటం జరిగిందన్నారు. ఒకప్పుడు రాజకీయమంటే హుందాగా గర్వంగా ఉండేది.. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు, నారా లోకేష్ కు ప్రతి ఒక్క కార్యకర్త చేయి చేయి కలిపి అండగా నిలవాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.
ఇక, గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడు జీవితాన్ని కార్యకర్తలకు అంకితం చేశారన్నారు. లీడర్ ఏవిధంగా వుంటే కార్యకర్తలు ఆవిధంగా ఉంటారని అన్నారు. త్వరలోనే మన ప్రభుత్వం రాబోతుందని పతనమైన వ్యవస్థలను సరి చేసి అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిమీద జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేసి దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. కార్యకర్తలు, అభిమానులు ధైర్యంగా ఉండాలని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చెందిన మహిళలకు, నాయకులకు, కార్యకర్తలకు యార్లగడ్డ వెంకట్రావ్ ధన్యవాదాలు తెలిపారు.
Read Also: YS Jagan: మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్ కోసమే..
ఈ కార్యక్రమంలో పంచుమర్తి అనురాధ, కొనకళ్ళ నారాయణ, చలమలశెట్టి రమేష్ బాబు, మల్లికార్జున రాజు, చిరుమామిళ్ల సూర్యం, బచ్చుల సుబ్రహ్మణ్యం (బోసు), దయాల రాజేశ్వరరావు, సర్నాల బాలాజీ, తగరం కిరణ్, పుట్టా సురేష్, జాస్తి వెంకటేశ్వరరావు, ఆరుమళ్ళ కృష్ణారెడ్డి, గొడ్డళ్ల చిన్న రామారావు, దొంతు చిన్న, ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, మూల్పూరి సాయి కళ్యాణి, గుండపనేని ఉమా వరప్రసాద్, వేములపల్లి శ్రీనివాసరావు, గూడవల్లి నరసింహారావు, వేగిరెడ్డి పాపారావు, ఆలూరి రాంబాబు, వెలివెల వెంకటేశ్వరరావు, జూపల్లి సురేష్, గుజ్జర్లమూడి బాబురావు, అట్లూరి శ్రీనివాసరావు, బొప్పన హరికృష్ణ, మేడేపల్లి రమ, పొదిలి లలిత, మొవ్వ వెంకటేశ్వరరావు, వడ్డిల్లి లక్ష్మి, గరికపటి నాగలక్ష్మీ, మండవ రమ్యకృష్ణ, చిక్కవరపు నాగమణి, బుస్సే సరిత, వడ్డీ నాగేశ్వరరావు, బొమ్మసాని అరుణ, చలసాని శ్రీనివాసరావు, కొల్లా ఆనంద్, సాంబు, మొవ్వ వేణుగోపాల్, కుమారస్వామి, సాయిల నాగేశ్వరరావు, కలపాల సూర్యనారాయణ, కొసరాజు సాయి, పరచూరి నరేష్, సుజాత, చిన్నం శ్రీదేవి, వల్లభనేని నాగమణి, యనమదల సతీష్, లావేటి వెంకటేశ్వరరావు, కృష్ణ ప్రసాద్, కలపాల కుమార్, మజ్జిగ నాగరాజు, కొండపల్లి వెంకన్న, కొండేటి నాగరాజు, వేగే కృష్ణారావు, ఓగిరాల నాని, మేడికొండ సూర్యప్రకాష్, తదితరులు పాల్గొన్నారు