ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం గన్నవరం పంచాయతీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో గన్నవరం పంచాయతీపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ స్పందించారు. సీఎం కార్యాలయం నుంచి పిలుపు వస్తే తాను వెళ్లానని.. అయితే సీఎం జగన్ వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో మళ్ళీ కలుద్దామని చెప్పారని వివరించారు. సీఎంవో అధికారులు తననేమీ వివరాలు అడగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి గన్నవరం అభ్యర్థిని తానేనని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎటువంటి విచారణ…
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతల పంచాయతీ హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు మధ్య కొంతకాలంగా గ్రూప్ తగాదాలు ఉన్నా.. ఇప్పుడు అవి పీక్స్‌కు చేరాయి. ఈ విషయం సీఎం ఆఫీసు వరకు వెళ్లింది. దీంతో వీరిద్దరి వ్యవహారం త్వరగా తేల్చాలని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఈరోజు సాయంత్రం క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు. వల్లభనేని వంశీమోహన్,…
గన్నవరం నియోజకవర్గంలోని వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు మధ్య కొంతకాలంగా గ్రూప్ తగాదాలు నడుస్తున్నాయి. ఈ విషయం సీఎంవో వరకు వెళ్లడంతో వారిద్దరికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. వీరి పంచాయతీ వివాదంపై పరిష్కరించేందుకు తొలుత బుధవారం సాయంత్రం రావాలని ఆదేశించినా… అనంతరం గురువారం సాయంత్రం 6గంటలకు తాడేపల్లికి రావాలని సీఎంవో సూచించింది. Crime News: గుంటూరు జిల్లాలో గుజరాత్…
రోడ్లపై ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిక వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై అదుపుతప్పి పిఎస్సార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బళ్లారి నుండి నెల్లూరు కు వెళుతుండగా జరిగిన ప్రమాదం జరిగింది.…
విమానం ఎక్కితే మంచి టేస్టీ ఫుడ్ తినవచ్చు. కేవలం అందులో ప్రయాణించేవారికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. అయితే అక్కడ ఇప్పుడు భోజనానికి విమానం ఎక్కుతున్నారు. అదేం బొమ్మ విమానం కాదు నిజమైన విమానం. విజయవాడ సిటీ దాటి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కి వెళ్లే దారిలో హైవే పక్కన ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ పిల్లల్ని, పెద్దల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఒక్కసారిగా చూసే ఎవరికైనా, నిజంగా ఫ్లైట్ ల్యాండ్ అయిందా అన్న ఫీలింగ్ కలుగుతుంది. సాధారణంగా ఫ్లైట్…
కృష్ణా జిల్లా వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరంలోని వైసీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో గన్నవరం వైసీపీ క్యాడర్ వైసీపీ కీలక నేత, పార్టీ వ్యవహారాల శాఖ ఇంఛార్జి విజయసాయిరెడ్డికి లేఖ రాసింది. ఈ లేఖ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు వల్లభనేని వంశీకి అప్పగించొద్దని వైసీపీ కార్యకర్తలు లేఖలో విజయసాయిరెడ్డిని కోరారు. తాము 9 సంవత్సరాల నుంచి కోట్ల రూపాయలు…
ఏపీకి అత్యంత కీలకమైన పోర్టుల్లో గన్నవరం పోర్టు ఒకటి. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఈ పోర్టు ప్రస్తుతం పూర్తిగా ప్రైవేటుపరం అవుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరోసారి హిటెక్కుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఏపీ సర్కారుకు ప్రస్తుతం గన్నవరం పోర్టు ప్రైవేటు చేతిలోకి పోతుండటంతో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ప్రతిపక్షాలకు ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ధి ఏజెండాగా ముందుకెళుతోంది.…
అమరావతి రైతులకు నటుడు సోనూసూద్ తన మద్దతు తెలిపారు. రాష్ట్ర రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా 600 రోజులకు పైగా నిరసన చేస్తున్న అమరావతి రైతులకు తాజాగా ఆంధ్రాలో పర్యటించిన సోనూసూద్ సపోర్ట్ చేశారు. మహిళలతో సహా అమరావతి నుండి కొంతమంది రైతులు సోనూసూద్ విజయవాడ సందర్శన సమయంలో ఆయనకు స్వాగతం పలకడానికి గన్నవరం విమానాశ్రయం దగ్గరకు వెళ్లారు. గురువారం 632వ రోజుకు చేరుకున్న తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విమానాశ్రయం దగ్గరే సోనూసూద్ ని కోరారు. గత…
గరం గరం పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన గన్నవరంలో టీడీపీ కేడర్‌కు కష్టమొచ్చిందట. అక్కడ పార్టీ ఇంఛార్జ్ ఉన్నా.. కేడర్‌కు లీడర్ కొరత మాత్రం తీరలేదని టాక్. సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని చర్చ జరుగుతోంది. ఈక్వేషన్లు కుదరడం లేదట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. గన్నవరం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న బచ్చుల అర్జునుడు ఏపీలోని టీడీపీ కంచుకోట నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. 2019 వైసీపీ గాలిలోనూ ఇక్కడ టీడీపీ గెలిచింది. కృష్ణా జిల్లాలో రెండుచోట్ల టీడీపీ గెలవగా..…