విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. నున్న గ్రామంలో నూతనంగా టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలో అధికార ప్రభుత్వ నాయకులు తెలుగు భాషను కు.ని చేసి బూతులు మాట్లాడం బాధాకరం అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఉద్యోగ కల్పనా కల్పించక పోగా యువతను తప్పు దారిలో నడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఐటీ కంనీలు తీసుకువస్తుందని.. యువతకు ఉద్యోగాలు కల్పిస్తుందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలాగా ప్రజలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: PM Modi: నీటి అడుగున ప్రయాణించే మెట్రోను ప్రారంభించనున్న మోడీ
ఈ సందర్భంగా.. నున్న గ్రామనికి చెందిన టీడీపీ అధ్యక్షుడు కలకోటి శ్రీనివాసరెడ్డి, స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాల వైసీపీకి చెందిన కార్యకర్తలు, నాయకులను యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరిలో ముఖ్య నేతలు.. పోలారెడ్డి సాంబిరెడ్డి, ఇలపోలు పుష్ప లీల, తగారం అశోక్, పరసా లిఖిత, నూకాళ్ళ విజయ, తుపాకుల వెంకీ బాబు, గడ్డం కృష్ణ, కాంతేటి వాణి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొడ్డల్ల చిన్న రామారావు, జిల్లా ఉపాధ్యక్షుడు గుజ్జర్లపూడి బాబురావు, కోనేరు సందీప్, కొల్ల ఆనంద్, పరుచూరి నరేష్, గారిమల్ల నాని, రాజు, అద్దెపల్లి సాంబు, తుపాకుల శివలీల.. జనసేన నాయకులు పదిలం దుర్గారావు, షేక్ సందని, పొదిలి లలిత, స్థానిక జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: Tonique Liquor: టానిక్ ఎలైట్ వైన్ షాప్ ల్లో జీఎస్టీ అధికారుల సోదాలు