మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది.. ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎందుకుంటే.. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్నారు వంశీ.. మరోవైపు.. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహిచారు. తన గెలుపుకు కృషిచేసిన గన్నవరం నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. గన్నవరం టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ గెలుపు కోసం కష్టపడి నియోజకవర్గంలో పనిచేశానని.. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాదని ముందుగానే తాను చెప్పానన్నారు. జగన్మోహన్ రెడ్డికి తాను చేసిన సవాల్ను నిజం…
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో గన్నవరం నియోజకవర్గం కూటమి అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. బాపులపాడు మండలం కె. సీతారామపురం, కొయ్యూరు గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి యార్లగడ్డ వెంకట్రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ప్రచారం మరింత విస్తృతం చేసిన యార్లగడ్డ.. విజయవాడ రూరల్ ప్రసాదంపాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, గ్రామ సర్పంచ్ సర్నాల బాలాజీ ఆధ్వర్యంలో ప్రచారం హుషారుగా సాగింది.. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. 175 కి 175 అన్న వైఎస్ జగన్…
చంద్రబాబు కన్నీటికి కారణమైన గన్నవరం నియోజకవర్గంలో నా విజయంతో ప్రజలు చంద్రబాబుకి గిఫ్ట్ గా ఇస్తారని నమ్ముతున్నాను అని యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉదయగిరి ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ బీ- ఫామ్ అందుకున్నారు.