బాపులపాడు పట్టణంలోని ఇందిరానగర్ లో గడప గడపకు ప్రజాగళం పేరుతో గన్నవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గన్నవరం నియోజకవర్గ ప్రజలు తనకు ఒక అవకాశం ఇచ్చి దీవిస్తే అభివృద్ధి పరంగా గన్నవరం రూపురేఖలు మారుస్తాను అని టీడీపీ- జనసేన- బీజేపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.
విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో గురువారం నాడు సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ప్రసాదంపాడులోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగాయి.
గన్నవరం నియోజకవర్గం రామవరప్పాడులో ఈరోజు M కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా గన్నవరం నియోజవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు , ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ పరిశీలకులు మరియు ఇన్చార్జ్ ఆకుల వెంకట నాంచారయ్య,…
భవన నిర్మాణ కార్మికులుగా వివిధ పనులు చేస్తూ జీవనం సాగించే సగరులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆకాంక్షించారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు.. ప్రచారంలో దూసుకుపోతుండగా, మరోవైపు పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా.. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో గన్నవరం హరిజనవాడకు చెందిన 500 మంది టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా.. తమ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తానంటున్న యార్లగడ్డను గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ గ్రామంలోని ఎస్ఆర్ కన్వెన్షన్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన గన్నవరం నియోజకవర్గ స్థాయి యాదవుల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో జోరందుకుంటుంది. ఈ క్రమంలో.. టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. విజయవాడ రూరల్ గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో ఇండిపెండెంట్ సర్పంచ్ కొడాలి సుకన్య, ఆమె మద్దతుదారులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
Yarlagadda Venkat Rao Starts Election Campaign in Gannavaram: గన్నవరం నియోజకవర్గ బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలోని రామాలయంలో వేదపండితులు పూజలు నిర్వహించిన అనంతరం శనివారం సాయంత్రం యార్లగడ్డ తన ప్రచారం ఆరంభించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియచేస్తూ.. రాష్ట్రంలో టీడీపీ పాలన ఆవశ్యకతను వివరించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గన్నవరం నియోజకవర్గంలోని అర్హులైన 15వేల…